Home News AP AP News | ఎల్లుండి నుంచే ఏపీలో ఒంటిపూట బడులు.. ఆ స్కూళ్లకు మాత్రం రెండు...

AP News | ఎల్లుండి నుంచే ఏపీలో ఒంటిపూట బడులు.. ఆ స్కూళ్లకు మాత్రం రెండు పూటల సెలవులు

AP News | ఎండలు పెరిగిపోతుండటంతో ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఉదయం 7:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు స్కూళ్లు పనిచేస్తాయని తెలిపారు. ఒంటిపూట బడుల నిర్వహణలో ఉపాధ్యాయులపై వివక్ష ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై కూడా మంత్రి స్పందించారు. ఒంటిపూట బడులు ఎప్పట్నుంచి నడపాలో తమకు తెలుసని ఆయన స్పష్టం చేశారు. ప్రతి వారం వాతావరణ శాఖ నుంచి నివేదికలు తెచ్చుకుని సమీక్షిస్తున్నామని బొత్స తెలిపారు. ఇప్పటివరకు ఎండల తీవ్రత తక్కువగానే ఉందని అందుకే ఒంటిపూట బడులు ప్రారంభించలేదని స్పష్టం చేశారు. ఈ వారం నుంచి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఒంటి పూట బడులు ప్రారంభించామని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలు జరిగే 3349 పాఠశాలలకు మాత్రం రెండు పూటల సెలవులు ఉంటాయని వెల్లడించారు.

ఏప్రిల్ 3 నుంచే పదో తరగతి పరీక్షలు‌

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు కూడా ఏప్రిల్ 3వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఏప్రిల్ 18వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఉదయం 9: 30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలకు నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని.. విద్యార్థులు తప్పనిసరిగా నిర్దిష్ట సమయానికి పరీక్షా కేంద్రానికి రావాలని సూచించారు. ప్రత్యేక కారణాలు ఉంటే తప్ప ఎవర్నీ నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని తెలిపారు. పరీక్షా కేంద్రానికి వచ్చే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని వెల్లడించారు. ప్రయాణం సమయంలో హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుందని తెలిపారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

CM KCR | నా జీవితమంతా పోరాటాలే.. ఎమోషనల్ అయిన సీఎం కేసీఆర్

Janhvi Kapoor | మాజీ సీఎం మనవడితో జాన్వీ కపూర్ డేటింగ్.. వీడియో వైరల్

Heart Attack | జగిత్యాలలో డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన కౌన్సిలర్‌ భర్త.. బీఆర్‌ఎస్‌ నేత ఆత్మీయుల సమ్మేళనం రద్దు

Scam | పింఛన్‌ కోసం 15 ఏళ్లుగా అంధురాలిగా నటించిన మహిళ.. చివరకు గుట్టురట్టు

TSRTC | సామాన్యులకు షాక్‌.. కేంద్రం నిర్ణయంతో బస్సు ఛార్జీలు పెంచేసిన టీఎస్‌ఆర్టీసీ

Exit mobile version