Home News International America | అమెరికాలో పేట్రేగిపోతున్న గన్ కల్చర్.. షికాగోలో హైదరాబాద్ విద్యార్థి మృతి.. 3 రోజుల్లో...

America | అమెరికాలో పేట్రేగిపోతున్న గన్ కల్చర్.. షికాగోలో హైదరాబాద్ విద్యార్థి మృతి.. 3 రోజుల్లో 20 మందికిపైగా దుర్మరణం..

America | అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ విచ్చలవిడిగా పెరిగిపోతుంది. కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బే ప్రాంతంలో గంటల వ్యవధిలోనే రెండు చోట్ల కాల్పులు జరిగాయి. స్థానిక కాలమాన ప్రకారం సోమవారం సాయంత్రం జరిగిన ఈ కాల్పుల్లో ఏడుగురు మరణించారు. కాల్పులకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. కాలిఫోర్నియా ఒక్కటే కాదు ఈ మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

షికాగోలో హైదరాబాద్ వాసి బలి

షికాగోలో తెలుగు విద్యార్థులపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో హైదరాబాద్‌కు చెందిన నందపు దేవ్‌శిష్ మృతిచెందాడు. కొప్పాల సాయిచరణ్ అనే మరో యువకుడు గాయపడ్డాడు. మరోవైపు ఐయోవా నగరంలోని డెస్ మొయినెస్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఎడ్యుకేషన్ మెంటర్‌షిప్ ప్రోగ్రాం జరుగుతుండగా ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

viral news | పురుషుడిగా మారాక వదిలేసిన యువతి.. కావాలంటే మళ్లీ లేడీగా మారమని సూచన.. ఇద్దరమ్మాయిల ప్రేమ కథలో ట్విస్ట్

IB Recruitment 2023 | పదో తరగతి అర్హతతో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఉద్యోగాలు.. ఎంపికైతే రూ. 69 వేల వరకు జీతం!

Hanmakonda | లేడీస్‌ హాస్టల్‌లో అర్ధరాత్రి దొంగతనం చేసి బావిలో పడ్డ దొంగ.. తెల్లారి బయటకుతీస్తే అసలు విషయం తెలిసింది!

Yadagirigutta | కాళ్లు,చేతులు కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కి ముగ్గురు చిన్నారులను నడిరోడ్డుపై వదిలేసిన తల్లి.. ప్రియుడి మోజులో పడి దారుణం

Exit mobile version