Home Latest News Teachers Transfers | టీచర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ఈనెల 27 నుంచి టీచర్ల...

Teachers Transfers | టీచర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ఈనెల 27 నుంచి టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు

Image by : www.bse.telangana.gov.in

Teachers Transfers | ప్రభుత్వ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈనెల 27 నుంచి టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపింది. దీనిపై సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగానే ఈనెల 27 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు దేవసేనను ఆదేశించారు. ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, పూర్తి షెడ్యూల్‌ వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.

ముందుగా గెజిటెట్‌ ప్రధానోపాధ్యాయులకు బదిలీలు జరుపనున్నారు. ఆ తర్వాత హెచ్‌ఎం ఖాళీలను స్కూలు అసిస్టెంట్లకు పదోన్నతి ఇచ్చి బదిలీ చేస్తారు. తర్వాత సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు పదోన్నతులు ఇచ్చి స్కూలు అసిస్టెంట్‌ ఖాళీలను బదిలీ చేస్తారు. ఇంతకుముందు 2015 జూలైలో బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. 2018లో బదిలీలు చేశారు. ఇప్పుడు అవే మార్గదర్శకాలను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | కొండగట్టు అంజన్న మీద పవన్‌ కళ్యాణ్‌కి అంత సెంటిమెంట్‌ ఎందుకు ? వారాహికి అక్కడే పూజలు చేయడానికి కారణమేంటి ?

Fire Accident | సికింద్రాబాద్ అగ్రిప్రమాదం ఘటనలో ముగ్గురు సజీవ దహనం.. బిల్డింగ్ కూల్చివేతపై నిర్ణయం తీసుకోనున్న అధికారులు

Kamareddy Master Plan | కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు.. రైతుల ఆందోళనకు తలొగ్గిన సర్కార్

Byreddy Siddarth Reddy | వైఎస్‌ జగన్‌ తెలంగాణలో వేలు పెడితే ప్రభుత్వాలు తలకిందులవుతాయి.. బీఆర్‌ఎస్‌పై బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

TSRTC | ఆర్టీసీ బస్సు ఎక్కడుందో ఇలా మీ మొబైల్‌లోనే ట్రాక్ చేయవచ్చు

Exit mobile version