Thursday, March 28, 2024
- Advertisment -
HomeNewsInternationalImran khan ex Wife reham khan | పదేండ్ల చిన్నవాడితో పాకిస్థాన్ మాజీ ప్రధాని...

Imran khan ex Wife reham khan | పదేండ్ల చిన్నవాడితో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య మూడో పెళ్లి

Imran khan ex Wife reham khan | ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రేహమ్ ఖాన్ మూడో పెళ్లి చేసుకున్నారు. 49 ఏళ్ల రేహమ్ ఖాన్‌ పదేండ్ల చిన్నవాడైన అమెరికాకు చెందిన మోడల్ మీర్జా బిలాల్ బైగ్‌ను వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇది మూడో వివాహం కాగా మీర్జాకు కూడా మూడో వివాహమే కావడం గమనార్హం.

చివరికి నేను నమ్మగలిగిన వ్యక్తి దొరికాడంటూ ట్విట్టర్‌లో ఫొటో షేర్ చేసిన రేహమ్.. తల్లిదండ్రులు, కుమారుడి సమక్షంలో మీర్జాను పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. ఇటీవలే తాను వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన రేహమ్ ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్లుగా ఫొటోను షేర్ చేశారు.

1973లో లిబియాలో జన్మించిన రేహమ్ ఖాన్ పాకిస్థాన్‌లో విద్యాభ్యాసం తర్వాత ఇంగ్లాండ్‌లో బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించారు. 2012లో ఓ ఇంటర్వ్యూ సమయంలో ఇమ్రాన్‌ఖాన్‌ను తొలిసారిగా రేహమ్ కలిసింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించుకున్నారు. 2015లో పెళ్లి చేసుకున్నారు. కానీ కేవలం పది నెలలు మాత్రమే కలిసి ఉన్నారు. తర్వాత విడాకులు తీసుకున్నారు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Bomb cyclone | క్రిస్మస్ వేళ అంధకారంలో అమెరికా.. అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న బాంబ్ సైక్లోన్

Dubai lottery | దుబాయిలో రూ.33 కోట్ల లాటరీ గెలుచుకున్న జగిత్యాల యువకుడు.. డ్రైవర్‌గా వెళ్లి కోటీశ్వరుడయ్యాడు

Coronavirus | వాళ్లందరికీ కొవిడ్ పరీక్షలు తప్పనిసరి.. కేంద్రం కీలక నిర్ణయం

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News