Home News AP Farmers Suicides | ఏపీలో పెరిగిన రైతు ఆత్మహత్యలు.. తెలంగాణలో తగ్గుముఖం: పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటన

Farmers Suicides | ఏపీలో పెరిగిన రైతు ఆత్మహత్యలు.. తెలంగాణలో తగ్గుముఖం: పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటన

Farmers Suicides | ఏపీలో గత మూడేండ్లలో రైతు ఆత్మహత్యలు భారీగా పెరిగాయని కేంద్ర వ్యవసాయ శాఖ పార్లమెంట్‌లో వెల్లడించింది. తెలంగాణలో మాత్రం తగ్గుముఖం పట్టాయని తెలిపింది. 2021 నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం ఏపీలో 1,673 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో 1,309 మంది తనువు చాలించినట్లు కేంద్రం వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2019 నుంచి 2021 వరకు 2,982 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాజ్యసభలో వెల్లడించారు.

దేశంలో అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా ఉందని కేంద్రం తెలిపింది. కర్నాటక, మహారాష్ట్ర తర్వాత ఏపీలోనే ఎక్కువగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొంది. 2017, 18తో పోలిస్తే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గినట్లు తెలిపింది. దక్షిణాదిలో రైతు ఆత్మహత్యల్లో కర్ణాటక, ఏపీ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయని తెలిపిన కేంద్రం.. మిగతా రాష్ట్రాల్లో మాత్రం తగ్గుముఖం పట్టినట్లు తెలిపింది

Follow Us : FacebookTwitter

Read More Articles |

cyclone mandous | తీరం దాటిన తుఫాన్..ఈ ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు

Perni Nani vs Pawan kalyan | ఏపీలో పవన్ కల్యాణ్ వారాహి మంటలు.. జనసేనాని, పేర్ని నాని మధ్య మాటల యుద్ధం

Perni Nani vs Pawan kalyan | ఏపీలో పవన్ కల్యాణ్ వారాహి మంటలు.. జనసేనాని, పేర్ని నాని మధ్య మాటల యుద్ధం

Exit mobile version