Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsFact Check | ఆధార్ కార్డు ఉంటే మోదీ ప్రభుత్వం రూ.4.78 లక్షల లోన్ ఇస్తుందా?...

Fact Check | ఆధార్ కార్డు ఉంటే మోదీ ప్రభుత్వం రూ.4.78 లక్షల లోన్ ఇస్తుందా? వైరల్ అవుతున్న మెసేజ్

Fact Check | ఆధార్ కార్డు ఉన్న వాళ్లందరికీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రూ.4.78 లక్షలు రుణం ఇస్తుందనే వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ లోన్ కోసం అప్లై చేసుకోవాంటూ ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ న్యూస్‌లో నిజమెంత ఉందనే విషయంపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసింది. దానికి సంబంధించిన వివరాలు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

ఆధార్ కార్డు ఉంటే రూ.4.78 లక్షల రుణం ఇస్తున్నారనేది నకిలీ వార్త అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌లో వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాలు ఏవీ అమలు చేయడం లేదని వెల్లడించింది. ఆధార్ కార్డుతో రుణాలు ఇస్తున్నారనేది ఫేక్ ప్రచారమని స్పష్టం చేసింది. ఇది సైబర్ నేరగాళ్లు పన్నిన కుట్ర అని.. అత్యాశకు పోయి మోసపోవద్దని సూచించింది. పొరపాటున కూడా లింక్ ఓపెన్ చేసి వ్యక్తిగత వివరాలను షేర్ చేయవద్దని సలహానిచ్చింది.

ప్రభుత్వం నుంచి ఏ సంక్షేమ పథకాన్ని పొందాలన్నా ఆధార్ కార్డును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. సిమ్ కార్డుల నుంచి బ్యాంకు అకౌంట్ల వరకు ప్రతి దాన్ని ఆధార్‌తో లింక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. ఆధార్ కార్డు ఉన్న వాళ్లకు లోన్ ఇస్తున్నారని ఆశ చూపిస్తూ ఇలాంటి లింక్స్ పంపిస్తున్నారు. నిజంగానే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని ఆశపడి ఫోన్‌కు వచ్చిన లింక్‌ను క్లిక్ చేశామో.. మన అకౌంట్లు గుల్ల కావాల్సిందే. అందుకే జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఆధార్ కార్డు ఉన్న వాళ్లకు లోన్లు ఇస్తున్నట్టు గతంలో కూడా ప్రచారం జరిగింది. గత ఏడాది నవంబర్‌లో కూడా ఇలాగే వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నిజానిజాలను వెలుగులోకి తీసుకొచ్చింది. దాంతో కొద్దిరోజులు ఈ మెసేజ్‌లు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ ఈ ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pallavi Joshi | కశ్మీర్ ఫైల్స్ నటికి యాక్సిడెంట్.. గాయాలతోనే షూటింగ్‌లో పాల్గొన్న పల్లవి జోషి

vijay antony | మలేసియాలో షూటింగ్ స్పాట్‌లో తీవ్రంగా గాయపడ్డ బిచ్చగాడు హీరో

Hyderabad tragedy | పండుగపూట హైదరాబాద్‌లో విషాదం.. భార్యాపిల్లలను, తల్లిని చంపి వ్యక్తి బలవన్మరణం

nepal plane crash | నేపాల్‌లో విమానం కూలింది ఇలా.. ప్రమాదం జరిగే ముందు ఫేస్‌బుక్‌ లైవ్ పెట్టిన యూపీ యువకులు

Ambati Rambabu | నేను సంబరాల రాంబాబునే.. కానీ ప్యాకేజీ కోసం డ్యాన్స్ చేయను.. నాగబాబుపై ఏపీ మంత్రి అంబటి సెటైర్లు

Hyper Aadi | ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హైపర్ ఆది పోటీ చేయబోతున్నాడా.. జనసేన తరఫున ఆ నియోజకవర్గం నుంచేనా ?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News