Home News International Layoffs | మైక్రోసాఫ్ట్, గూగుల్ తర్వాత భారీగా ఉద్యోగులను తొలగించిన డిస్నీ

Layoffs | మైక్రోసాఫ్ట్, గూగుల్ తర్వాత భారీగా ఉద్యోగులను తొలగించిన డిస్నీ

Layoffs | టెక్‌ కంపెనీల్లో రోజురోజుకి పరిస్థితులు ఏవిధంగా ఉంటున్నాయో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా అనేక దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగులకు లే ఆఫ్స్‌ ఇచ్చి ఇంటికి పంపించేస్తున్నాయి. ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోవడానికి భారీగా ఈ కోతలను చేపట్టాయి. తాజాగా ఇప్పుడే ఈ లేఆఫ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీలోకి కూడా వచ్చాయి. వాల్ట్ డిస్నీ కంపెనీ 7 వేల మందిని ఉద్యోగంలో నుంచి తీసేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

తమ సంస్థలో నుంచి 7 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వాల్ట్ డిస్నీ సీఈవో బాబ్ ఇగర్ ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థలో పనిచేస్తున్న ప్రతిభావంతులైన ఉద్యోగులంటే తనకు గౌరవం అని సీఈఓ బాబ్ ఇగర్ ఈ సందర్భంగా బాబ్ ఇగర్ తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవడం అంతా తేలికైనా విషయం కాదని సీఈఓ వెల్లడించారు. గత ఏడాది చివర్లో సీఈఓ గా బాధ్యతలు స్వీకరించిన బాబ్‌ తీసుకున్న అతి పెద్ద నిర్ణయం ఇది. ప్రపంచ వ్యాప్తంగా డిస్నీకి లక్షా 90 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 80 శాతం మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు. కాగా వీరిలో 7వేల మందిని తాజాగా డిస్నీ తొలగించింది. సబ్‌స్క్రైబర్లు భారీగా తగ్గిపోవడంతో డిస్నీ కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తాజాగా డిస్నీ ప్లస్ సబ్ స్కైబర్ల సంఖ్య భారీగా తగ్గింది. దీంతో పాటు గత త్రైమాసికంలో కూడా చందాదారులు కూడా బాగా తగ్గారు. వాల్ట్ డిస్నీ స్థాపించిన స్టోరీడ్ కంపెనీ కూడా తన స్ట్రీమింగ్ చందాదారులను కోల్పోయింది. డిస్నీ గ్రూప్ మూడు నెలల కాలానికి 23.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించింది. ఇది విశ్లేషకులు అంచనా వేసిన దాని కంటే ఎక్కువ. లాభం కూడా 1.279 డాలర్లుగా నమోదైంది. అయినప్పటికీ కాస్ట్ కటింగ్‌లో భాగంగా 7వేల మందిని డిస్నీ తొలగించింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Narendra Modi | దేశం కోసమే నా జీవితం అంకితం చేశా.. కాంగ్రెస్‌ వల్ల దశాబ్ద కాలాన్ని కోల్పోయాం.. కాంగ్రెస్‌పై మోదీ ఫైర్‌!

Cow Hug Day | లవర్స్‌కి అలర్ట్‌.. భారత్‌లో ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కాదట.. కౌ హగ్‌ డేనట.. అందరూ ఇలా చేయాలన్న పశుసంవర్ధక శాఖ!

Transgender Pregnant | పండంటి బిడ్డకు జన్మినిచ్చిన అబ్బాయి.. సోషల్‌ మీడియా ద్వారా ఆనందాన్ని పంచుకున్న అతని భార్య

KA Paul | సీఎం క్యాంప్‌ ఆఫీసును తగలబెట్టాలన్న రేవంత్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదు.. కేఏ పాల్‌ ఫైర్‌!

Exit mobile version