Home Lifestyle Health Corona Cases | చైనాలో కరోనాతో వారంలో 13వేల మంది మృతి.. ఇంకా రోజుకు 30...

Corona Cases | చైనాలో కరోనాతో వారంలో 13వేల మంది మృతి.. ఇంకా రోజుకు 30 వేల మరణాలు ఉంటాయని అంచనా!

Corona Cases | చైనాలో కరోనా ఏ మాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు. ఆ దేశం తాజాగా విడుదల చేసిన కరోనా మరణాల డేటాను చూస్తే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఇప్పటికే అక్కడ రోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఈ క్రమంలో చైనా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ లెక్కలు ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్నాయి.

చైనాలో వారం రోజుల వ్యవధిలో ఆస్పత్రుల్లో 13 వేల మంది కోవిడ్‌ సంబంధిత మరణాలు సంభవించాయని చైనా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ వెల్లడించింది. కరోనాతో ఆస్పత్రిలో చేరిన వాళ్లలో శ్వాస కోశ సంబంధిత వ్యాధులతో 681 మంది, 11,977 మంది కోవిడ్‌తో పాటు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల వల్ల పరిస్థితి విషమించి కన్నుమూసినట్లు పేర్కొంది. ఇవి కేవలం ఆస్పత్రుల్లో మరణించిన వారి లెక్కలు మాత్రమే. చైనాలో ఇంకా కరోనాతో కోట్లాది మంది బాధపడుతున్నారు. ఆస్పత్రులు కూడా నిండిపోయాయి. దీంతో ఇంటి దగ్గర ఉండి చికిత్స పొందుతున్న వారు కోట్లల్లో ఉన్నారు. ఇలా ఇంటిదగ్గర ప్రాణాలు కోల్పోయిన వారు ఇంకా భారీగానే ఉండొచ్చని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

చైనాలో జీరో కోవిడ్‌ ఎత్తేసిన తర్వాత నెల రోజుల్లోనే 60 వేల మంది మరణించినట్లు గతంలో ఆ దేశం వెల్లడించింది. ప్రస్తుతం చైనాలో ప్రజలంతా కొత్త సంవత్సరం సెలవుల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. జీరో కోవిడ్‌ ఆంక్షలు లేకపోవడంతో ప్రయాణాలు కూడా భారీగా చేస్తున్నారు. దీంతో మున్ముందు కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో రోజుకు ౩౦ వేలకు పైగా కరోనా మరణాలు సంభవించే అవకాశం ఉందని అభిప్రాయ పడుతున్నారు. ఆ సంఖ్య మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. అయితే చైనా సీడీసీ చీఫ్‌ ఎపిడెమాలజిస్ట్‌ మాట్లాడుతూ దేశంలో ఇప్పటికే మెజారిటీ జనాభా కరోనా బారిన పడ్డారని, ఇప్పట్లో మరో వేవ్‌ వచ్చే అవకాశమే లేదన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

covid19 | కరోనా సోకిన వాళ్లు 18 నెలల వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే.. లేదంటే ప్రాణాలకే ముప్పు

Covid 19 | చైనాలో 30 రోజుల్లో 60వేల మంది కరోనాతో మృతి.. ఎట్టకేలకు నోరువిప్పిన అధికారులు

Ban on Gas stoves | చిన్న పిల్లల్లో పెరుగుతున్న అస్తమా.. గ్యాస్ స్టౌవ్ బ్యాన్ చేసే యోచనలో అమెరికా?

Diabetes | ఈ జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహాన్ని జయించొచ్చు.. ఏంటవి?

Heart Attack | ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటు అని అనుమానించాల్సిందే.. అస్సలే ఆలస్యం చేయొద్దు

Exit mobile version