Tuesday, April 16, 2024
- Advertisment -
HomeLatest NewsAmit Shah | వచ్చే ఎన్నికల నాటికి నక్సలిజం లేకుండా చేస్తాం.. కేంద్ర హోం మంత్రి...

Amit Shah | వచ్చే ఎన్నికల నాటికి నక్సలిజం లేకుండా చేస్తాం.. కేంద్ర హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు

Amit Shah | దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివర్లో ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన షా.. గడిచిన దశాబ్ద కాలంగా నక్సలైట్ల హింసా ఘటనలు తగ్గుముఖం పట్టాయన్నారు.

నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లోని యువతకు నరేంద్ర మోదీ సర్కారు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చేసి.. ఆయుధాలను పట్టుకునేవారిని పారదోలిందన్నారు. 2009లో 2,258 నక్సలైట్ల హింసా ఘటనలు జరిగాయని, 2021 నాటికి ఆ సంఖ్య 509కి తగ్గాయని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ పనితీరుకు ఇదే నిదర్శనమని అన్నారు. 2024 ఎన్నికల నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని అమిత్ షా ప్రకటించారు. నక్సల్స్ రహిత దేశం చేయాలన్నదే తమ లక్ష్యమని అన్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో అవినీతి, అత్యాచారాలు, నేరాలు పెరిగిపోయాయని షా ఆరోపించారు. గత ఐదేళ్లలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని భూపేశ్ భగేల్ సర్కారు ఛత్తీస్‌గడ్‌కు చేసిందేమీ లేదన్నారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలంటే బీజేపీకే ఓటేయాలని ఈ సందర్భంగా అమిత్ షా పిలుపునిచ్చారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Viral News | నాకు కేన్సర్ అని అమ్మానాన్నలకు చెప్పొద్దు ప్లీజ్.. డాక్టర్‌ను వేడుకున్న ఆరేళ్ల బాలుడు.. కన్నీరు పెట్టిస్తున్న వైద్యుడి ట్వీట్!

Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరంలోకి భక్తులను ఎప్పుడు అనుమతిస్తారు ? ఆలయ విశేషాలేంటి.. శిల్పులు ఎవరు ?

Telangana Tourist Places | తెలంగాణలోని ఈ ఆలయంలో 700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండజ్యోతి.. గంభీరావుపేటలోనే

Peddagattu lingamanthula jathara | తెలంగాణలో జరిగే రెండో అతిపెద్ద జాతర ఇదే.. పెద్దగట్టు జాతర ప్రత్యేకత ఏంటి ? ఎలా వెళ్లాలి ?

Chitragupta Temple | హైదరాబాద్‌లో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో చిత్రగుప్తుడి ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News