Monday, March 27, 2023
- Advertisment -
HomeNewsInternationalCanada | కెనడాలో వేధిస్తున్న ఇళ్ల కొరత.. విదేశీయులు ఇళ్లు కొనకుండా నిషేధం విధించిన సర్కార్

Canada | కెనడాలో వేధిస్తున్న ఇళ్ల కొరత.. విదేశీయులు ఇళ్లు కొనకుండా నిషేధం విధించిన సర్కార్

Canada | కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలో విదేశీయులు ఇళ్లు కొనకుండా ఆంక్షలు విధించింది. ఇళ్ల కొరతను అధిగమించేందుకు నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రెండేళ్ల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తుండగా ప్రభుత్వ నిర్ణయం పెద్దగా ఫలితాన్ని ఇవ్వదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ నిషేధం నుంచి శరణార్థులు, పర్మినెంట్ రెసిడెంట్స్‌కు మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధం కేవలం నివాస గృహాలకు మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. కరోనా విజృంభించినప్పటి నుంచి కెనడాలో వీదేశీ పెట్టుబడి దారులు భారీగా ఇళ్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో స్థానికంగా ఇళ్లకు కొరత ఏర్పడి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. స్థానికులు ఇళ్లు కొందామన్నా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇదే విషయం 2021లో ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశంగా మారింది. అప్పుడు ప్రధాని రేసులో ఉన్న జస్టిస్ ట్రూడో విదేశీయులు ఇళ్లు కొనకుండా నిషేధం విధిస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ కూడా ఇచ్చారు. అధికారంలోకి రావడంతో గతంలో ఇచ్చిన హామీ మేరకు నిషేధం విధించారు.

కరోనా తర్వాత విదేశీ పెట్టుబడిదారులు, కార్పొరేట్లు కెనడాలో ఇళ్లు కొనేందుకు ఆసక్తి చూపించారు. ఫలితంగా కెనడా వాసులకు ఇళ్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. కేవలం ఇళ్లు కొని అలానే ఉంచడంతో ఖాళీ ఇళ్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో వాంకోవర్, టొరెంటో వంటి నగరాల్లో ఖాళీగా ఉన్న ఇళ్లపై ప్రభుత్వం భారీగా పన్నులు విధించడం మొదలుపెట్టింది. ఇది మంచి ఫలితాన్నిచ్చింది. ఇళ్ల ధరలు దిగి వచ్చాయి. ఒకప్పుడు 8 లక్షల కెనడా డాలర్లుగా ఉన్న ఇళ్లు 6.30 లక్షల కెనడా డాలర్లకు పడిపోయాయి. తాజాగా విదేశీయులు ఇళ్లు కొనకుండా రెండేళ్లపాటు నిషేధం విధించడంపై నిపుణులు పెదవి విరిచారు. దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం కెనడాలో కేవలం 5 శాతం ఇళ్లు మాత్రమే విదేశీయుల చేతులో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Telangana Assembly Elections | తెలంగాణలో కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా ? మార్చిలో ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా ?

Delhi High Court | భార్య నగలపై భర్త ఆశపడటం నేరమే.. ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్య

World’s Toughest Exams | ప్రపంచంలో అత్యంత కఠినమైన టాప్‌ 3 పరీక్షలు ఇవే.. వీటిలో పాస్‌ అయితేనే ఉద్యోగం, ఉన్నత చదువులు!

Viral | అక్కడ గాలిపటాలు ఎగిరేసినా బట్టలు బయట ఎండేసినా నేరమే.. అలా చేస్తే జైల్లో ఉండాల్సిందేనట!

Eider polar duck | ఇవి నిజంగా బంగారు బాతులే.. కిలో ఈకలతో 10 తులాల బంగారం కొనొచ్చు .. అంతలా ఏముంది వీటిలో?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
500SubscribersSubscribe

Recent News