Home Latest News Vijayashanthi on KCR | తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. ఆయనో విష...

Vijayashanthi on KCR | తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విజయశాంతి కీలక వ్యాఖ్యలు.. ఆయనో విష సర్పం!

Image Source: Vijayashanthi Facebook

Vijayashanthi on KCR | తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా టికెట్ ఇచ్చి నన్ను ఓడించేందుకు కుట్ర చేశాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్‌‌‌ను విష సర్పంతో పోలుస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచినా.. బీజేపీలో చేరినప్పటి నుంచి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. విజయశాంతి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి 25 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

” నేను తెలంగాణ కోసం పోరాడి అందరికీ శత్రువులా మారాను. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలన్నదే నా చిన్నప్పటి నుంచి కల. అవినీతి లేని క్రమశిక్షణ గల పార్టీ బీజేపీ అని తెలిసింది. అందుకే ఈ పార్టీలో చేరాను” అని విజయశాంతి పేర్కొన్నారు. బీజేపీతోనే తన రాజకీయ ప్రస్థానం మొదలైందని, 1998లో వాజ్‌పేయి, అద్వానీల సమక్షంలో పార్టీలో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే అప్పుడు బాధతోనే పార్టీని విడిచిపెట్టానని.. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నానని విజయశాంతి అన్నారు.

సినీ పరిశ్రమలో 43 ఏళ్లు పని చేశా కానీ రాజకీయాల్లో ఉన్న 25 ఏళ్లు మాత్రమే సుదీర్ఘంగా అనిపించాయని అన్నారు. తెలంగాణ కోసం మొదటి నుంచి కూడా బీజేపీ పోరాటం చేసిందన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, నష్టాలైనా పోరాడుతూనే వచ్చానని అన్నారు. తెలంగాణ కోసమే తాను బయటకు వచ్చానని అన్నారు. తెలంగాణ కోసం పోరాడుతుంటే కేసీఆర్‌ అనే రాక్షసుడు నా జీవితంలో ఎంటర్‌ అయ్యాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎంపీగా టికెట్‌ ఇచ్చి నన్ను ఓడించడానికి కేసీఆర్‌ కుట్ర చేశాడని విజయశాంతి ఆరోపించారు. ఆ తరువాత కారణం లేకుండానే టీఆర్ఎష్ నుంచి తనను సస్పెండ్‌ చేశారని అన్నారు. అందమైన తెలంగాణ ప్రస్తుతం ఒక అసమర్థుని చేతిలో ఉందంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ఒక విషసర్పమని మరొకసారి అధికారంలోకి వస్తే మాత్రం ఎవరూ బతకరు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అందరినీ చంపేస్తాడని, . ఎవ్వరికీ పెన్షన్‌ లు కూడా ఇవ్వడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సారి బీజేపీకి అవకాశం ఇవ్వాలంటూ కోరారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Job Notifications | నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2391 కొత్త పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TTD | అరచేతిలో వైకుంఠనాథుడి విశేషాలు.. మొబైల్‌లో ఒక్క క్లిక్‌తోనే శ్రీవారి దర్శనం టికెట్లు, రూమ్స్ అన్నీ బుక్ చేసుకోవచ్చు

Jamuna | టాలీవుడ్‌లో మరో విషాదం.. సినీ నటి జమున కన్నుమూత

Taraka Ratna | నందమూరి తారకరత్నకు గుండెపోటు.. లోకేశ్ యువగళం యాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన టీడీపీ నేత

Balakrishna | అక్కినేని తొక్కినేని వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ.. వివాదం సద్దుమణిగినట్టేనా?

Exit mobile version