Saturday, January 28, 2023
- Advertisment -
HomeNewsInternationalviral | బ్యాంకును దోచుకుని.. దొరకద్దని ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుంది.. 25 ఏళ్లకు పట్టుబడ్డ చైనా...

viral | బ్యాంకును దోచుకుని.. దొరకద్దని ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుంది.. 25 ఏళ్లకు పట్టుబడ్డ చైనా మహిళ

viral | ఇది సినిమా స్టోరీని మించిన ట్విస్ట్‌! ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన యువతి ఏకంగా బ్యాంకునే దోచేసింది. కన్నవాళ్లను.. కట్టుకున్నోడిని వదిలేసి ఊరు కాని ఊరు వెళ్లిపోయింది. ఎవరూ గుర్తుపట్టకుండా ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుని వేషం మార్చుకుంది. భాష తీరు మార్చేసింది. కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అలా 25 ఏళ్లకు పైగా తప్పించుకుని తిరిగింది. పాపం పండటంతో చివరకు దొరికిపోయింది.

అది 1997.. చైనా జిజియెంగ్‌ ప్రావిన్స్‌లోని యెకింగ్‌కు చెందిన చెన్‌ వైల్‌ అనే 26 ఏళ్ల యువతి చైనా కన్‌స్ట్రక్షన్‌ బ్యాంకులో క్లర్క్‌గా పనిచేసేది. ఆ సమయంలో బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఉన్న ఒక లోపాన్ని గుర్తించింది. డబ్బులు విత్‌ డ్రా చేసే ముందు అకౌంట్‌లో ఉన్న అమౌంట్‌ను ఎడిట్‌ చేసుకునే అవకాశం ఉందని తెలుసుకుంది. ఇంకేముంది ఈ లోపాన్ని ఉపయోగించుకుని తన మధ్యతరగతి కష్టాల నుంచి బయటపడాలనే అత్యాశకు పోయింది. అనుకున్నదే తడువుగా పక్కా ప్లాన్‌ రెడీ చేసుకుంది. అనుకున్న పథకం ప్రకారం రూ.2.17 కోట్లను విత్‌డ్రా చేసింది. బ్యాంకు నుంచి డబ్బులు కొట్టేసిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుంది.

రూపం మార్చుకున్న తర్వాత తన పుట్టింటికి వెళ్లింది. రహస్యంగా వాళ్ల ఇంటి చుట్టూ కొంత డబ్బును ఉంచింది. అవి అయిపోతే వాడుకునేందుకు వీలుగా తోబుట్టువుల పేరు మీద నాలుగు బ్యాంకు అకౌంట్లు తెరిచింది. వాటికి సంబంధించిన పాస్‌బుక్‌లు కూడా కుటుంబ సభ్యులకు అందేలా ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయింది. కానీ దొంగ సొమ్ముతో బతకడానికి చెన్‌కు మనసు ఒప్పుకోలేదు. వెంటనే పోలీసుల దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. కూతురు దొంగిలించిన డబ్బును పోలీసులకు అప్పగించాడు.

కుటుంబసభ్యుల కోసం ఇచ్చిన డబ్బులు పోనూ మిగిలిన డబ్బుతో దూరంగా వెళ్లిపోయింది. తన పుట్టిన ప్రావిన్స్‌కు దాదాపు వెయ్యి మైళ్ల దూరంలో ఉన్ గుయిజెవో ప్రావిన్స్‌కు వెళ్లి సెటిలయ్యింది. తన పేరు మార్చుకుని అక్కడే క్లీనింగ్‌ సప్లయిస్‌ కంపెనీని ప్రారంభించింది. బిజినెస్‌ విమెన్‌గా ఎదిగింది. ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆమెకు ఓ కుమార్తె కూడా జన్మించింది. అలా పాతికేళ్లు గడిచిపోయాయి. కూతురు, భర్తతో కొత్త జీవితం హాయిగా గడిచిపోయింది.

ఇక తన నేరం బయటపడదు.. గతం ఎవరికీ తెలియదని లోలోపల సంతోషపడుతున్న తరుణంలో పోలీసులు ఆమెను వెతుక్కుంటూ ఇంటి ముందు వరకు వచ్చేశారు. చేసిన నేరానికి ఆమెను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అయితే తాను బ్యాంకు నుంచి డబ్బులు దోచుకుని వచ్చే సమయానికి చెన్‌కు పెళ్లయింది. అతనికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వచ్చేసి.. ఇక్కడ రెండో పెళ్లి చేసుకుంది. దీంతో బ్యాంకు అవినీతి, ఐడెంటిటీ మార్పిడి కేసులతో పాటు విడాకులు తీసుకోకుండానే రెండో పెళ్లి చేసుకుందనే కేసును కూడా చెన్‌పై నమోదు చేశారు. అయితే చెన్‌ అరెస్టయ్యే వరకు కూడా ఆమె గతం కూతురు, రెండో భర్తకు తెలియదు. దీంతో తమ ముందు జరిగిన పరిణామాలు చూస్తూ షాకవ్వడం తప్ప వాళ్లేమీ చేయలేని అయోమయంలో పడిపోయారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

viral news | పురుషుడిగా మారాక వదిలేసిన యువతి.. కావాలంటే మళ్లీ లేడీగా మారమని సూచన.. ఇద్దరమ్మాయిల ప్రేమ కథలో ట్విస్ట్

IB Recruitment 2023 | పదో తరగతి అర్హతతో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో ఉద్యోగాలు.. ఎంపికైతే రూ. 69 వేల వరకు జీతం!

Hanmakonda | లేడీస్‌ హాస్టల్‌లో అర్ధరాత్రి దొంగతనం చేసి బావిలో పడ్డ దొంగ.. తెల్లారి బయటకుతీస్తే అసలు విషయం తెలిసింది!

Yadagirigutta | కాళ్లు,చేతులు కట్టేసి.. నోట్లో గుడ్డలు కుక్కి ముగ్గురు చిన్నారులను నడిరోడ్డుపై వదిలేసిన తల్లి.. ప్రియుడి మోజులో పడి దారుణం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
22FansLike
11FollowersFollow
14FollowersFollow
250SubscribersSubscribe

Recent News