Sunday, January 29, 2023
- Advertisment -
HomeNewsAPPawan Kalyan | ఏపీ సీఎం జగన్‌కు గ్యాంబ్లింగ్‌ పిచ్చి.. ఆ డైమండ్‌ రాణితోనూ తిట్లు...

Pawan Kalyan | ఏపీ సీఎం జగన్‌కు గ్యాంబ్లింగ్‌ పిచ్చి.. ఆ డైమండ్‌ రాణితోనూ తిట్లు తింటున్నా: పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan | ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి గ్యాంబ్లింగ్‌ పిచ్చి ఉందని ఈ మధ్యే తెలిసిందంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. ఖైదీ నంబర్‌ 6093 కూడా నా గురించి మాట్లాడితే ఎలా అంటూ జగన్‌ను ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. తాను అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్ర వెనుబాటుతనాన్ని రూపుమాపుతాని పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. ఉత్తరాంధ్ర వలసలు ఆపడమే కాదు అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు.

రాష్ట్రంలోని యువత కోసమే తిట్లు తింటున్నానని పవన్‌ అన్నారు. యువత తనను నమ్మితే సమస్యలు తీరుస్తానని మాటిచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని అన్నారు. కానీ ఇక్కడి సమస్యల గురించి మాట్లాడే వారే లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

Pavan Kalyan
Image Source: janasena facebook

ఆ మాట అంటే ముక్కలు చేస్తాం

ఎక్కడైనా సరైన రాజు లేకపోతే సగం రాజ్యం నాశనం అవుతుందని అన్నారు. సలహాలిచ్చేది సజ్జల అయితే రాజ్యం పూర్తిగా నాశనం అవుతుందంటూ ఏపీ సీఎం జగన్‌ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేస్తానని ఒక నేత అంటున్నారని.. మరోసారి ఆ మాట అంటే మిమ్మల్ని ముక్కలు చేస్తామంటూ పవన్‌ ధ్వజమెత్తారు. మీకు పదవులు లేకపోతే రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా అంటూ ధర్మానను ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర రాష్ట్రం ఇస్తే అప్పడంలా నమిలేస్తారంటూ ధ్వజమెత్తారు. జనసైనికులు కేవలం నినాదాలిస్తే సరిపోదని, పోలింగ్‌ రోజు ఓటు వేసే వరకు ఆ కసి ఉండాలని పార్టీ కార్యకర్తలకు పవన్‌ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

రోజాపై పవన్‌ సెటైర్లు

ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనకు చట్ట సభల్లో పోరాడే శక్తి ఇవ్వలేదని పవన్‌ అన్నారు. అందుకే ఇప్పుడు ప్రజా క్షేత్రంలో పోరాడుతున్నానని చెప్పారు. రెండు చోట్లా ఓడిపోయానని ఆ డైమండ్‌ రాణి రోజా మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి రోజాను ఉద్దేశించి సెటైర్లు వేశారు. చివరికి డైమండ్‌ రాణీతో కూడా తిట్లు తింటున్నానని అన్నారు. వైకాపాకు అంతమంది ఎంపీలు ఉండి ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. జనసేనకు పది మంది ఎమ్మెల్యేలను ఇచ్చినా బలంగా పోరాడే వాడినని అన్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Pawan Kalyan | మీ నాన్న వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డినే ఎదుర్కొన్నా.. నువ్వెంత ? ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి పవన్‌ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan | నేను గెలుస్తానో ఓడుతానో తెలియదు.. కానీ గూండాలను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు: పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan | ఎవడ్రా మనల్ని ఆపేది.. రణస్థలంలో గర్జించిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌

Hyper Aadi | పవన్‌ కళ్యాణ్‌కు తిక్క రేగితే మీరంతా కాశీ యాత్రకే.. ఏపీ మంత్రులపై హైపర్‌ ఆది సెటైర్లు

RRR Sequel | ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై రాజమౌళి కీలక అప్‌డేట్.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన వేళ నిర్ణయం మార్చుకున్న జక్కన్న

varisu vs thunivu | ఇదేం అరాచకం.. చెన్నైలో థియేటర్ ముందే తన్నుకున్న విజయ్, అజిత్ ఫ్యాన్స్

RRR Naatu Naatu | రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్.. నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు

Oscars 2023 | సైలెంట్‌గా ఆస్కార్ బరిలోకి నిలిచిన కాంతార.. సౌత్ నుంచి ఇంకా ఏ సినిమాలు నామినేషన్స్‌లో నిలిచాయి?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
22FansLike
11FollowersFollow
14FollowersFollow
250SubscribersSubscribe

Recent News