Home News AP AP Politics | ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు దేవుడు రాసిన స్క్రిఫ్టే ట్రెండింగ్.. వచ్చే ఎన్నికల్లో...

AP Politics | ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు దేవుడు రాసిన స్క్రిఫ్టే ట్రెండింగ్.. వచ్చే ఎన్నికల్లో అదే రిపీట్ అవుతుందా.. చంద్రబాబుకు బొక్క పడనుందా ?

AP Politics | ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు మరోసారి రాజకీయ రచ్చకు తెరలేపాయి. గత కొంతకాలంగా ఛాన్స్ కోసం ఎదురు చూసిన టీడీపీ శ్రేణులకు ఈ ఎన్నికలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. అధికార వైసీపీపై టీడీపీ శ్రేణులు దేవుడి స్క్రిఫ్ట్ ఇదే అంటూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే విజయం అంటూ చెలరేగిపోతున్నారు. అటు తామేం తక్కువ తిన్నాం అన్నట్లుగా వైసీపీ కూడా అవును.. వచ్చే ఎన్నికల్లో దేవుడి స్క్రిఫ్ట్ మరోసారి నిజం కాబోతుందంటూ ఆటాడుకుంటున్నారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. అధికార టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మే 23 న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. దీంతో వైసీపీ శ్రేణులు టీడీపీని ఓ ఆటాడుకున్నాయి. దేవుడే 23వ తేదీన టీడీపీని 23 సీట్లకు పరిమితం చేశాడంటూ విమర్శలు గుప్పించారు. ఇది దేవుడి స్క్రిఫ్ట్ అంటూ సోషల్ మీడియాలో రచ్చలేపారు. ఎందుకంటే వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని వారిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇచ్చింది. దీంతో వైసీపీ రగిలిపోయింది.

సమయం కోసం వేచి చూసింది. దీనికి తగ్గట్టే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లకే పరిమితమైంది. ఛాన్స్ దొరికింది కాబట్టి వైసీపీ శ్రేణులు ఆటాడుకున్నాయి. చంద్రబాబుకు తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాలేదు. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను అక్రమంగా టీడీపీలో చేర్చుకున్నారు కాబట్టే 2019 ఎన్నికల్లో దేవుడు కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చాడంటూ చెలరేగిపోయారు. దేవుడి స్క్రిఫ్ట్ ఇదే అంటూ రెచ్చిపోయారు. ప్రజలు కూడా మే 23వ తేదీన ఫలితాలు రావడం.. 23 సీట్లకే టీడీపీ పరిమితం కావడం చూసి ఆ దేవుడే చంద్రబాబుకు శిక్ష వేశాడంటూ మాట్లాడుకున్నారు.

అయితే నాలుగేళ్లలో సీన్ రివర్స్ అయింది. 2019 లో టీడీపీ తరఫున గెలిచిన 23 మందిలో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ జైకొట్టారు. దీంతో టీడీపీకి 19 మంది మాత్రమే మిగిలారు. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలవాలంటే కచ్చితంగా 22 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 19 మంది సభ్యులున్నా తమ అభ్యర్థిగా అనురాధను టీడీపీ అధినేత చంద్రబాబు నిలబెట్టారు. అధినేత వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో 23 ఓట్లతో ఎమ్మెల్సీ సీటును తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. దీంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తో పాటు పార్టీ శ్రేణులు రెచ్చిపోయారు.

2023లో మార్చి 23 వ తేదీన 23 ఓట్లతో టీడీపీ ఎమ్మెల్సీ సీటును కైవసం చేసుకుంది. ఇది కదా అసలు దేవుడు స్క్రిఫ్ట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులతో చెలరేగిపోయారు. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను అక్రమంగా మా నుంచి లాక్కుని వైసీపీలో చేర్చుకున్నందుకు దేవుడు ఊరుకోలేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలోని 175 స్థానాలకు 175 స్థానాలను కైవసం చేసుకుంటామని సీఎం జగన్ తరచుగా పేర్కొంటున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత ట్రెండ్ మార్చారు. 2019 కంటే ముందు తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను అక్రమంగా కొనుగోలు చేసి టీడీపీలో చేర్చుకున్నందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో 23 స్థానాలకే దేవుడు తెలుగు దేశం పార్టీని పరిమితం చేశాడని, ఈ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను అక్రమంగా కొనుగోలు చేసిన ఫలితం చంద్రబాబు అనుభవిస్తారంటూ వైసీపీ శ్రేణులు అంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ గెలవబోయే ఎమ్మెల్యేల సంఖ్య నలుగురే అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

దేవుడు ఎవరినీ వదిలిపెట్టడని.. తప్పకుండా చంద్రబాబుకు శిక్ష విధిస్తాడంటూ మట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాము 175 కు 175 స్థానాలు కాకపోయినా కచ్చితంగా 171 స్థానాలైతే గెలుస్తామంటున్నారు. ఇదే దేవుడి స్క్రిఫ్ట్.. వచ్చే ఎన్నికలతో నిజం కాబోతుందంటూ టీడీపీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఇంతకీ ఏపీలో నిజంగా దేవుడి స్క్రిఫ్ట్ నిజమే అయితే టీడీపీ కేవలం నాలుగు సీట్లకే పరిమితం అవుతుందా అంటూ ఆలోచిస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

LB Nagar Flyover | ఎల్బీ నగర్ జంక్షన్‌కు శ్రీకాంతాచారి పేరు.. హయత్ నగర్ వరకు మెట్రో నిర్మాణం.. కేటీఆర్ కీలక ప్రకటన

Rahul Gandhi | సారీ చెప్పేందుకు సావర్కర్‌ని కాదు.. ఎంపీగా అనర్హత వేటుపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి షాక్.. పార్లమెంట్ సభ్యత్వం రద్దు

Sircilla | రివార్డులు వస్తాయని ఆశపడి.. లక్షన్నర పోగొట్టుకున్న సిరిసిల్ల యువతి

Rains | తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్‌.. రెండు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

AP MLC Elections | టీడీపీకి క్రాస్‌ ఓటింగ్‌ వేసిన వైసీపీ ఎమ్మెల్యేలు ఆ నలుగురేనా.. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారు ?

AP MLC Elections | ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్.. అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి విజయం

Eyes Twitching | కన్ను కొట్టుకుంటే ఏం జరుగుతుంది..ఎవరికి ఏ కన్ను అదిరితే మంచిది!

Variety Railway Station | ప్రయాణం చేయకపోయిన టికెట్లు కొంటాం అంటున్న దయాల్‌పుర్ గ్రామస్థులు!

Do You Know | రైలు చివరి బోగి మీద X ఎందుకు రాస్తారో తెలుసా?

Exit mobile version