Home News AP AP CM Jagan | తోడేళ్లు అన్నీ ఒక్కటవుతున్నాయి.. మీ బిడ్డ సింహంలా ఒక్కడే నడుస్తాడు.....

AP CM Jagan | తోడేళ్లు అన్నీ ఒక్కటవుతున్నాయి.. మీ బిడ్డ సింహంలా ఒక్కడే నడుస్తాడు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై ఏపీ సీఎం జగన్ సెటైర్లు

AP CM Jagan | టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై ఏపీ సీఎం జగన్ విరుచుకుపడ్డారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 మీడియా సంస్థల మీద కూడా నిప్పులు చెరిగారు. ఈ గజ దొంగల ముఠా గతంలో రాష్ట్రాన్ని దోచేసుకుందని ఆరోపించారు. జగనన్న చేదోడు మూడో విడత కార్యక్రమంలో భాగంగా వినుకొండలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిపక్షాలు, పలు మీడియా సంస్థలపై జగన్ విమర్శలు గుప్పించారు.

శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేస్తున్నారు

దేశానికే ఆదర్శంగా 11.43 గ్రోత్ శాతంతో ఏపీ ప్రభుత్వం అభివృద్ధిలో పరుగులు పెడుతుంటే.. మీ బిడ్డ ( జగన్ ) అంటే గిట్టనివాళ్లు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఇప్పుడు చూస్తున్నాం.. గత పాలన చూశాం.. మీరే ఆలోచించండి అని ప్రజలకు సూచించారు. గతంలో కూడా ఎందరో పాలకులను చూశామని.. ఒక ముసలాయన్ను ముఖ్యమంత్రి స్థానంలో చూశామని గుర్తు చేశారు. గతంలో కూడా ఇదే రాష్ట్రం.. గతంలో కూడా ఇదే బడ్జెట్.. కానీ గతంలో కన్నా ఈ రోజు మీ బిడ్డ చేస్తున్న అప్పుల గ్రోత్ రేట్ చాలా తక్కువ అని చెప్పారు. గతంలో ఎందుకు ఇన్ని పథకాలు లేవో.. ఎందుకు ఇంత అభివృద్ధి జరగలేదో ఆలోచించాలని అన్నారు. మీ బిడ్డ పాలనలో ఎందుకు అభివృద్ధి జరుగుతుందో అర్థం చేసుకోండి. అదే ముసలాయన ప్రభుత్వాన్ని గుర్తు తెచ్చుకోండి అని ప్రజలకు సూచించారు.

దత్త పుత్రుడు నాకోసం మైకు పట్టుకోకపోవచ్చు

‘ గత ప్రభుత్వంలో ఓ గజ దొంగల ముఠా ఉండేది. ఆ ముఠాకు దుష్టచతుష్టయం అని పేరు ఉండేది.. అది ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, చంద్రబాబు.. వీళ్లకు ఒక దత్తపుత్రుడు. ఇదీ గజల దొంగల ముఠా. వీళ్ల స్కీమ్ డీపీటీ.. దోచుకో.. పంచుకో.. తినుకో.. రాష్ట్రాన్ని గజదొంగల ముఠా దోచేసింది. ఈనాడు రాయదు.. ఆంధ్రజ్యోతి రాయదు.. చూపదు.. టీవీ5 మాట్లాడదు.. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు ప్రశ్నించడు . ‘ అని విమర్శించారు.

ఇలాంటి వాళ్ల పరిపాలన కావాలా? లంచాలు లేని.. వివక్ష లేని నేరుగా బటన్లు నొక్కే మీ బిడ్డ పరిపాలన కావాలా ఆలోచించుకోండి.’ అని సూచించారు. ముసలాయన మాదిరి ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు. ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు.. టీవీ 5 తోడుగా ఉండకపోవచ్చు.. దత్త పుత్రుడు నాకోసం మైకు పట్టుకోకపోవచ్చు.. నేను వీళ్లను నమ్ముకోలేదు.. నేను నమ్ముకున్నది నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు, నా నిరుపేద వర్గాలను నమ్ముకున్నాను. అని స్పష్టంచేశారు.

మీ బిడ్డ ఒంటరిగా పోరాడుతున్నాడు

ఈ రోజు రాష్ట్రంలో జరిగేది కులాల యుద్ధం కాదని. పేద వాళ్లు ఒకవైపు ఉంటే పెద్ద వాళ్లు ఒకవైపు ఉండే యుద్ధం నడుస్తోందని జగన్ అన్నారు. మాట ఇస్తే దాని మీదే నిలబడే మీ బిడ్డ ఒకవైపు.. వెన్నుపోటు, మోసాలు మరోవైపు ఉండి ఈ యుద్ధం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇలాంటి యుద్ధంలో మీ బిడ్డకు ఉన్నదళ్లా.. కేవలం దేవుడి దయ.. మీ అందరి చలవ తప్ప ఏమీ లేవు అని స్పష్టం చేశారు. మీ బిడ్డకు పొత్తులు లేవని తెలిపారు. వాళ్ల మీద వీళ్ల మీద ఆధారపడడని స్పష్టం చేశారు. మీ బిడ్డ ఒక్కడే సింహంలా నడుస్తాడు అని తెలిపారు. తోడేళ్లు అందరూ ఒక్కటి అవుతున్నారు.. కానీ మీ బిడ్డకు భయం లేదని స్పష్టం చేశారు. మీ బిడ్డ నమ్ముకుంది మిమ్మల్ని.. దేవుణ్ని మాత్రమేనని.. అందుకే తోడేళ్లు అంటే భయం లేదని స్పష్టం చేశారు. మీ అందరి చల్లని ఆశీస్సులు, దీవెనలు ఉండాలని కోరారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Divyansha Kaushik | చైతూపై నాకు క్రష్ ఉంది.. నాగచైతన్యతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మజిలీ బ్యూటీ

Kajal Aggarwal | శ్రీలీలకు తల్లిగా కాజల్ అగర్వాల్.. బాలయ్య కోసం అంత సాహసం చేస్తుందా?

Rajinikanth | అనుమతి లేకుండా పేరు వాడితే… రజనీకాంత్ బహిరంగ హెచ్చరిక

Naresh | నన్ను చంపేందుకు కుట్ర.. కొత్త వివాదానికి తెరలేపిన సీనియర్ నటుడు నరేశ్

Exit mobile version