Friday, March 29, 2024
- Advertisment -
HomeLatest NewsTelangana chief secretary | తెలంగాణకు తొలి మహిళా సీఎస్ .. కీలక నిర్ణయం తీసుకున్న...

Telangana chief secretary | తెలంగాణకు తొలి మహిళా సీఎస్ .. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్

Telangana chief secretary | తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్ ఆంధ్రప్రదేశ్‌ కు వెళ్లడంతో తెలంగాణకు ఎవరు నియమితులవుతారు అనే దాని మీద అనేక సందేహలు తలెత్తాయి. ఈ క్రమంలో ప్రధానంగా వినిపించిన పేరు శాంతి కుమారి ( Santhi kumari ). ఆమెను తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రానికి మొట్టమొదటి సారిగా మహిళా ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి బాధ్యతలు చేపట్టారు. ఆమె 1989 ఐఏఎస్‌ బ్యాచ్ కి చెందినవారు. ప్రస్తుతం ఆమె అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఇంతకు ముందు ఆమె వైద్య, ఆరోగ్య శాఖలో వృత్తి బాధ్యతలు నిర్వహించారు.

తెలంగాణ ఏర్పడక ముందు ఆమె మెదక్‌ కలెక్టర్గా విధులు నిర్వర్తించారు. నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. ఆమె ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆమెకు అభినందనలు తెలిపారు. ఆమె ఎమ్మెస్సీ మెరైన్‌ బయాలజీ తో పాటు, యూఎస్‌లో ఎంబీఏ పూర్తి చేశారు.

ముప్పై సంవత్సరాలుగా ఐఏఎస్‌గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి , విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్‌మెంట్‌, అటవీశాఖలో వివిధ పదవుల్లో సేవలందించారు. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా రెండేళ్ల పాటు పని చేశారు. గతంలో నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ , టీఎస్‌ఐపాస్‌లో ఇండస్ట్రీ చేజింగ్ సెల్‌ స్పెషల్‌ సెక్రటరీగా కూడా విధులు నిర్వహించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Sakthivanesvara Temple | ఈ ఆలయంలో పూజలు చేస్తే దంపతుల ఇబ్బందులు తొలగిపోతాయట.. ఎక్కడుందో తెలుసా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News