Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsCordyceps | భారత్‌లోకి చైనా సైన్యం చొరబడేది ఆ బంగారం కోసమేనట.. తాజా నివేదికలో సంచలన...

Cordyceps | భారత్‌లోకి చైనా సైన్యం చొరబడేది ఆ బంగారం కోసమేనట.. తాజా నివేదికలో సంచలన విషయాలు

Cordyceps | చైనా సైనికులు భారత్‌లోకి తరచూ చొరబడేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారో తెలుసా? హిమాలయన్‌ గోల్డ్‌గా పిలిచే పుట్టగొడుగు రకానికి చెందిన కార్డిసెప్స్‌ ( Cordyceps ) కోసమట. వినడానికి విడ్డూరంగా అనిపించినా ఇండో-పసిఫిక్‌ ఫర్‌ స్ట్రాటెజెస్‌ కమ్యూనికేషన్స్‌ ( IPCSC ) తాజాగా నివేదిక విడుదల చేసింది. చైనా సైనికులు భారత్‌లో పదేపదే ఎందుకు చొరబడుతున్నారో ఈ నివేదికలో పేర్కొన్నారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌లోకి చైనా పీఎల్‌ఏ సైన్యం ఈనెల 9న చొరబడేందుకు ప్రయత్నించింది. దీంతో భారత సైన్యం అడ్డుకుని వారిని వెనక్కివెళ్లేలా చేసింది. ఈ సమయంలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజా నివేదిక ఆసక్తికరంగా మారింది. బంగారం కంటే విలువైన కార్డిసెప్స్‌ కోసమే చైనా సైనికులు భారత్‌లోకి చొరబడ్డారని IPCSC తన నివేదికలో పేర్కొంది.

అసలేంటీ కార్డిసెప్స్‌ ?

కార్డిసెప్స్‌ పుట్టగొడుగు రకానికి చెందినవి. గొంగళి పురుగు ఫంగస్‌ లేదా హిమాలయన్‌ గోల్డ్‌గా దీన్ని పిలుస్తారట. ఇది అత్యంత అరుదుగా లభిస్తుందని, దీనిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి పసుపు, కాషాయ రంగులో సన్నటి పోగులా ఉంటాయి. వీటిని సూపర్‌ మష్రూమ్స్‌గానూ పిలుస్తారు. ఈ కార్డిసెప్స్‌ అత్యంత ఖరీదైనవి. 10 గ్రాములకు 700 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.56 వేలు ఉన్నట్లు తెలుస్తోంది. మేలు రకం కార్డిసెప్స్‌కి ఇంకా ఎక్కువే ధర ఉంటుందని చెబుతున్నారు.

ఎక్కడ దొరుకుతాయి ?

ఈ కార్డిసెప్స్‌ చైనాలోని కింగై-టిబెట్ ప్రాంతాలతో పాటు భారత్‌లోని హిమాలయాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయట. వీటి ఎగుమతులు, ఉత్పత్తుల్లో చైనానే ముందుంది. అయితే ఇప్పుడు కింగై ప్రాంతంలో వీటి సాగు పూర్తిగా క్షీణించిందట. దీంతో డిమాండ్‌ బాగా పెరిగిపోయింది. వీటిని అన్వేషించేందుకే చైనా సైనికులు భారత్‌ భూభాగాల్లోకి చొరబడుతున్నట్లు ఐపీసీఎస్‌సీ నివేదిక వెల్లడించింది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Imran khan ex Wife reham khan | పదేండ్ల చిన్నవాడితో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య మూడో పెళ్లి

New Year Calender | కొత్త క్యాలెండర్ ఇంటికి తీసుకొస్తున్నారా? ఈ దిక్కున మాత్రం అస్సలు పెట్టకండి

Disaster movies of 2022 | ఈ ఏడాది టాలీవుడ్‌లో అత్యంత డిజాస్టర్‌ అయిన మూవీస్‌ ఇవే..

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News