Home Lifestyle Devotional Temple | ఆలయాలు ఏ వస్తువులు దానం చేయాలి? వాటి వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతారు?

Temple | ఆలయాలు ఏ వస్తువులు దానం చేయాలి? వాటి వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతారు?

Temple | ఆలయాలకు వెళ్లినప్పుడు భగవంతుడికి భక్తులు కానుకలు సమర్పించుకుంటుంటారు. దీనివల్ల కోరిన కోర్కెలు నెరవేరతాయని, పుణ్యఫలం దక్కుతుందని ఆశిస్తుంటారు. ఈ కారణంతోనే కొత్తగా ఆలయాలు నిర్మించినప్పుడు భక్తుల నుంచి చందాలు స్వీకరిస్తారు. భక్తులు తమకు తోచిన వస్తువులు ఆలయానికి దానం ఇస్తుంటారు. అయితే ఇలా దానమిచ్చే వస్తువులను బట్టి మనకు అనుగ్రహ ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

పురాణాల ప్రకారం కొత్తగా దేవాలయం నిర్మించినప్పుడు.. ఆ ఆలయ గోడలకు సున్నం గానీ, గుడి ముందు ముగ్గులు వేయిస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. శంఖం దానం చేయడం వల్ల వచ్చే జన్మలో గొప్ప కీర్తిప్రతిష్ఠలు సంపాదిస్తారు. గంట దానం చేయడం వల్ల కీర్తి పొందుతారు.గజ్జెలు, నువ్వులు దానం చేయడం వల్ల సౌభాగ్యం సిద్ధిస్తుంది. కమండాలు దానం చేయడం వల్ల గోదానం చేసినంత పుణ్యం దక్కుతుంది. బంగారు, వెండి ఇతర లోహాలు దానం చేస్తే పుణ్యఫలాలు దక్కడమే కాకుండా కోరిన కోర్కెలు నెరవేరతాయి. దేవుడి పరిచర్యల కోసం చిన్న చిన్న వెండి పాత్రలు దానం చేస్తే హోమాలు చేసినంత పుణ్యం దక్కుతుంది. జెండా దానం చేస్తే సకల పాపాల నుంచి విముక్తి పొందుతారు. అద్దం దానం చేస్తే మంచి రూపం లభిస్తుంది. ఆలయానికి వచ్చిన భక్తుల చల్లదనం కోసం ప్రాంగణంలో పందిళ్లు వేయిస్తుంటారు. దీనివల్ల ధర్మబుద్ధి కలుగుతుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Exit mobile version