Home Lifestyle Devotional Sankranti special | భోగి రోజు చిన్న పిల్లలకు భోగి పండ్లు ఎందుకు పోస్తారు? దీని...

Sankranti special | భోగి రోజు చిన్న పిల్లలకు భోగి పండ్లు ఎందుకు పోస్తారు? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కోణం ఏంటి?

Sankranti special | తెలుగు ప్రజలు జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి. దక్షిణాయానం నుంచి ఉత్తరాయనంలోకి సూర్యుడు ప్రవేశించిన సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా భోగిమంటలు, ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులు, కోడిపందేలతో తెలుగు లోగిళ్లు కళకళలాడుతుంటాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సంబురాల్లో భాగంగా తొలి రోజు భోగి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున చిన్న పిల్లలకు భోగిపళ్లు పోయడం ఆనవాయితీగా వస్తుంది. భోగి పండుగ నాడు పిల్లలకు భోగి పళ్లు ఎందుకు పోస్తారు? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కోణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

భోగి పండుగ రోజు రేగు పళ్లను పిల్లలపై పోస్తారు. రేగి చెట్టును సంస్కృతంలో బదరీ వృక్షంగా వ్యవహరిస్తారు. దీన్ని నారాయణుడి ప్రతిరూపంగా భావిస్తారు. అలాగే ఇవి సూర్యభగవానుడికి అత్యంత ఇష్టమైన ఫలం. కాబట్టి రేగు పండ్లను పిల్లల తల మీద పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. అందుకే నాణేలతో కలిపి రేగుపళ్లను పిల్లల తలపై పోస్తే మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. భోగి పళ్లను పోయడం వల్ల తలపై భాగంలో ఉండే బ్రహ్మరంధ్రం ప్రేరేపితం అవుతుంది. దీనివల్ల పిల్లలు జ్ఞానవంతులు అవుతారని ఒక నమ్మకం కూడా ఉంది.

సూర్య కిరణాల్లోని ప్రాణ శక్తిని రేగు పళ్లు అధికంగా గ్రహిస్తాయి. కాబట్టి వీటిని తల మీద పోసినప్పుడు రేగు పళ్లలోని విద్యుచ్ఛక్తి.. శరీరంపై ప్రభావం చూపించి సత్ఫలితాలను ఇస్తాయని కూడా చెబుతుంటారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Bhogi special | సంక్రాంతి వేడుకల్లో భోగి మంటలు ఎందుకు వేస్తారు? పురాణాలు ఏం చెబుతున్నాయి? వైద్యులు ఏమంటున్నారు?

Lakshmi Devi | లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తులసి పూజ ఎలా చేయాలి?

Water in Dreams | కలలో తరచూ నీళ్లు కనిపిస్తున్నాయా? మీ కలలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Exit mobile version