Home Lifestyle Devotional Rudraksha | రుద్రాక్ష ఎలా పుట్టింది? దీనికి ఎన్ని ముఖాలు ఉంటే మంచిది?

Rudraksha | రుద్రాక్ష ఎలా పుట్టింది? దీనికి ఎన్ని ముఖాలు ఉంటే మంచిది?

Rudraksha | రుద్రాక్షలను హిందువులు చాలా పవిత్రంగా చూస్తారు. సాక్షాత్తు పరమశివుడి స్వరూపంగా భావిస్తారు. రుద్రాక్ష ధరించడం వల్ల కష్టాలు నశిస్తాయని, గ్రహదోషాలు తొలగిపోయి సుఖశాంతులతో, అష్టఐశ్వర్యాలతో తులతూగుతారని చెబుతుంటారు. మరి ఇంతటి మహిమ కలిగిన రుద్రాక్షలు ఎన్ని రకాలు.. వాటి పుట్టుక వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పూర్వం త్రిపురాసురుడు అనే రాక్షసుడు తన దుర్మార్గాలతో సమస్త లోకాలను బాధించేవాడు. అతని బాధలు భరించలేని దేవతలు తమను రక్షించమని కైలాసానికి వెళ్లి మహాశివుడిని వేడుకుంటారు. వారి ప్రార్థనను ఆలకించిన పరమేశ్వరుడు త్రిపురాసురుడిని అంతమొందించేందుకు అఘోరాస్త్రాన్ని సృష్టిస్తాడు. ఈ అస్త్రం కోసం దాదాపు వెయ్యి ఏళ్ల పాటు పరమశివుడు తపస్సు చేశాడు. ఆ సమయంలో ఈశ్వరుడు మూడు నేత్రాలను మూసుకుని ధ్యానంలో మునిగిపోయాడు. అ ధ్యానంలోనే శంకరుడి మూడు కన్నుల నుంచి కన్నీటి బిందువులు రాలాయి. ఈ బిందువులే రుద్రాక్ష వృక్షాలుగా ఆవిర్భవించాయి. మొత్తం 38 రకాల వృక్షాలుగా ఉద్భవించాయి. వీటిలో ఎడమ కన్ను నుంచి 12, కుడి కన్ను నుంచి 16, మూడో కన్ను నుంచి 10 రుద్రాక్ష వృక్షాలు ఆవిర్భవించాయి. రుద్రుడి కన్నీటి ధారలతో ఏర్పడిన వృక్షాలు కనుకనే వాటికి రుద్రాక్షలు అనే పేరు వచ్చింది. వీటిలో ఏక ముఖ నుంచి పద్నాలుగు ముఖాల రుద్రాక్షలు ఉన్నాయి. ఇందులో పద్నాలుగు ముఖాలు కలిగిన రుద్రాక్ష పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది చెబుతారు.

రుద్రాక్షలు వాటి విశిష్టత

ఏక ముఖి రుద్రాక్ష – శివుడు
ద్విముఖి రుద్రాక్ష – శివకేశవులు
త్రిముఖి రుద్రాక్ష – అగ్ని
చతుర్ముఖి రుద్రాక్ష – బ్రహ్మస్వరూపం
పంచముఖి రుద్రాక్ష – కాలాగ్ని
షణ్ముఖి రుద్రాక్ష – సుబ్రహ్మణ్య స్వామి
సప్తముఖి రుద్రాక్ష – అనంగ
అష్టముఖి రుద్రాక్ష – వినాయకుడు
నవముఖి రుద్రాక్ష – భైరవుడు
దశముఖి రుద్రాక్ష – జనార్ధనుడు
ఏకాదశ ముఖి రుద్రాక్ష – రుద్రుడు
ద్వాదశ ముఖి రుద్రాక్ష – ద్వాదశాదీత్యులు
త్రయోదశ ముఖి రుద్రాక్ష – కార్తికేయుడు
చతుర్దశ ముఖి రుద్రాక్ష – పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రం

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Exit mobile version