Home Latest News Bank Holidays | నో హాలీడేస్‌.. ఆ రెండు రోజులు బ్యాంకులు పనిచేస్తాయి

Bank Holidays | నో హాలీడేస్‌.. ఆ రెండు రోజులు బ్యాంకులు పనిచేస్తాయి

Bank Holidays | వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌ అని బాధపడుతున్న వాళ్లకు గుడ్‌ న్యూస్‌. బ్యాంకులో ఏదైనా లావాదేవీలు పెండింగ్‌లో ఉంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఎందుకంటే జనవరి 30, 31 వ తేదీల్లో దేశ వ్యాప్తంగా తలపెట్టిన సమ్మెను అన్ని బ్యాంకు యూనియన్లు వాయిదా వేశాయి. ముంబైలో జరిగిన సమావేశంలో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ఏకాభిప్రాయానికి రావడంతో సమ్మె వాయిదా పడింది. దీంతో సోమవారం నుంచి యథావిధిగా బ్యాంకులు పనిచేయనున్నాయి.

బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లపై బ్యాంకు యూనియన్లు జనవరి 31న చర్చిస్తాయని బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ వెంకటాచలం చెప్పారు. ఈ క్రమంలోనే జనవరి నెల చివరి రోజున యూనియన్లతో సమావేశం నిర్వహించేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకరించింది. ఆ రోజు జరిగే సమావేశంలో వారంలో ఐదు రోజుల బ్యాంకింగ్, పింఛన్ పెంపు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ అనే మూడు ఉమ్మడి అంశాల గురించి చర్చించనున్నట్లు తెలిపారు. మిగిలిన సమస్యలు, సంబంధిత అధికారులు, కార్మిక సంఘాలతో విడివిడిగా చర్చలు జరుపుతామని పేర్కొన్నారు.

బ్యాంకు యూనియన్ల సమూహం, తమ వివిధ డిమాండ్ల కోసం సమ్మె చేయాలని యూఎఫ్బీయూ గతంలోనే నిర్ణయించింది. తమ డిమాండ్లను చాలా కాలం కిందటే మంత్రి వర్గం ముందు ఉంచినప్పటికీ ఇప్పటి వరకు వాటి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెంకటాచలం ఆవేదన వ్యక్తం చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?

Naatu Naatu Song | నాటు నాటు సాంగ్ విదేశీయులకు కూడా నచ్చడానికి కారణమిదే.. అసలు విషయం చెప్పిన చంద్రబోస్

Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..

Oscars 2023 | ఇండియన్ మూవీకి అకాడమీ అవార్డు.. సైలెంట్‌గా వచ్చి ఆస్కార్ కొట్టేసిన ది ఎలిఫెంట్ విష్పరస్

Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్‌కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు

Oscars 2023 | అకాడమీ అవార్డ్స్‌లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వచ్చేసింది

Exit mobile version