Home Lifestyle Health Cancer | చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే కేన్సర్‌ను నిరోధించే ఛాన్స్‌.. ఏం చేయాలి !

Cancer | చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే కేన్సర్‌ను నిరోధించే ఛాన్స్‌.. ఏం చేయాలి !

Cancer | ఆధునిక జీవనశైలి.. ఆహారపు అలవాట్లతో దేశంలో కేన్సర్‌ బాధితులు విపరీతంగా పెరిగిపోతున్నారు. అయితే మన జీవన శైలిలో చిన్నచిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా కేన్సర్‌ను నిరోధించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఇంతకీ ఏంటా చిట్కాలు..? రోజూవారీగా ఏం చేస్తే కేన్సర్‌ను దూరంగా పెట్టొచ్చనేది ఓసారి లుక్కేయండి మరి..

ప్రతిరోజూ ఉదయం ఇడ్లీ, దోస, చపాతీ, పూరీలను బ్రేక్‌ఫాస్ట్‌లో లాగించేస్తాం. కానీ అప్పుడప్పుడు తక్కువ కేలరీలు ఉండే క్యారెట్లను తింటే మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. కొంతమంది ఉదయం లేవగానే పాలల్లో మిల్క్‌ బ్రెడ్‌ తీసుకుంటారు. కానీ దానికి బదులు బ్రౌన్‌ బ్రెడ్‌ తీసుకోవడం మంచిదంటున్నారు.

కొంతమందికి ఉప్పు ఎక్కువ తినడం అలవాటు. అలాంటి వారికి బీపీతో పాటు ఉదర సంబంధ కేన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. జఠర రసం ఉంచి ఉదరకోశాన్ని కాపాడే లైనింగ్‌ను ఉప్పు దెబ్బతీస్తోందట. అందుకే వీలైనంత వరకు మితంగా ఉప్పు తీసుకోవాలని నిపుణలు సూచిస్తున్నారు.

ఇక కొందరికి ప్రతి రోజూ రెడ్‌ మీట్‌ లేనిదే ముద్ద దిగదు. అలాంటి వారిలో పేగు కేన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వీలైనంత వరకు రెడ్‌ మీట్‌ను తగ్గించాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. దీని వల్ల కేన్సర్‌తో పాటు గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. రెడ్‌ మీట్‌ను ప్రతిరోజూ తినేవాళ్లు కనీసం వారంలో ఒక్కరోజైనా మాంసాహారాన్ని మానేసి శాఖాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

స్థూలకాయానికి 10 రకాల కేన్సర్లకు సంబంధం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ప్రతిరోజూ 100 కేలరీల ఆహారం ఎక్కువగా తీసుకుంటే ఏడాదికి 5 కిలోల బరువు అదనంగా పెరుగుతారు. కాబట్టి మితంగా ఆహారం తీసుకుంటూనే ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలపాటు వ్యాయామం తప్పనిసరిగా చేయాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కూడా కేన్సర్‌ ముప్పు నుంచి తప్పించుకోవచ్చంటున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

covid19 | కరోనా సోకిన వాళ్లు 18 నెలల వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే.. లేదంటే ప్రాణాలకే ముప్పు

Covid 19 | చైనాలో 30 రోజుల్లో 60వేల మంది కరోనాతో మృతి.. ఎట్టకేలకు నోరువిప్పిన అధికారులు

Ban on Gas stoves | చిన్న పిల్లల్లో పెరుగుతున్న అస్తమా.. గ్యాస్ స్టౌవ్ బ్యాన్ చేసే యోచనలో అమెరికా?

Diabetes | ఈ జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహాన్ని జయించొచ్చు.. ఏంటవి?

Heart Attack | ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటు అని అనుమానించాల్సిందే.. అస్సలే ఆలస్యం చేయొద్దు

Exit mobile version