Thursday, April 25, 2024
- Advertisment -
HomeLatest NewsCredit Card | క్రెడిట్ కార్డు యూజర్లకు భారీ షాక్.. ఆ చార్జీలను రెండింతలు పెంచేసిన...

Credit Card | క్రెడిట్ కార్డు యూజర్లకు భారీ షాక్.. ఆ చార్జీలను రెండింతలు పెంచేసిన ఎస్బీఐ

Credit Card | క్రెడిట్ కార్డు వినియోగాదారుల్లో చాలామందికి రెంట్ పేమెంట్ ఆప్షన్ గురించి తెలిసే ఉంటుంది. అత్యవసర సమయాల్లో చాలామంది ఈ ఆప్షన్ ఉపయోగించుకుని డబ్బులు పొందే ఉంటారు. దీనికోసం నామమాత్రంగా 1 లేదా 2 శాతం ఇంట్రెస్ట్‌ను ఛార్జీల రూపంలో బ్యాంకులు వసూలు చేసేవి. కానీ ఎటువంటి అదనపు రుసుము విధించేవారు కాదు. కానీ ఇటీవల నాలుగు నెలల క్రితం వీటిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదనపు ఛార్జీలు విధించడం మొదలుపెట్టింది. ఇంట్రెస్ట్ ఛార్జీలను పక్కనబెడితే అదనంగా రూ.99 వసూలు చేసేది. దీనికి జీఎస్టీ అదనం. ఇదే భారంగా ఫీలవుతున్న క్రెడిట్ కార్డు యూజర్లకు ఎస్బీఐ మరోసారి షాకిచ్చింది. ఈ రుసుమును కూడా భారీగా పెంచేసింది.

రెంట్ పేమెంట్ సదుపాయం వినియోగించుకున్నందుకు ఇప్పటివరకు రూ.99గా వసూలు చేస్తున్న రుసుమును రూ.199కి పెంచుతూ ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. దీనికి జీఎస్టీ అదనం అని పేర్కొంది. మార్చి 17 నుంచి ఈ కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని ఎస్బీఐ పేర్కొంది. ఈ మేరకు వినియోగదారుల మొబైల్స్‌కు మెసేజ్‌లు కూడా పంపిస్తుంది. అయితే నాలుగు నెలల కిందటి వరకు అసలు రెంట్ పేమెంట్‌పై ఛార్జీలు లేవు. కేవలం ఇంట్రెస్ట్ మాత్రమే తీసుకునేవాళ్లు. నవంబర్‌ నుంచే రూ.99ని వసూలు చేయడం మొదలుపెట్టింది. నాలుగు నెలలు కాకుండా ఈ ఛార్జీలను ఎస్బీఐ డబుల్ చేసేసింది.

ఎస్బీఐ కాకుండా ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు 1 శాతం రుసుము వసూలు చేస్తున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి కోటక్ మహీంద్రా బ్యాంకు కూడా 1 శాతం రుసుము వసూలు చేయడం మొదలుపెట్టింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

AP CM Jagan | 30 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం జగన్ వార్నింగ్.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వనని హెచ్చరిక

IndiGo | లాభాలు వచ్చాయని.. పైలట్ల జీతాలు పెంచిన ఇండిగో

LTTE Chief Prabhakaran | టైగర్ బతికే ఉన్నారు.. ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్‌పై నెడుమారన్ సంచలన వ్యాఖ్యలు

KCR on Etela Rajender | ఈటల తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరతారా.. అసెంబ్లీలో కేసీఆర్‌ ఏమన్నారు.. ఈటల రియాక్షన్‌ ఏంటి?

bachelors | అందమైన అమ్మాయి దొరకాలని పెళ్లి కాని ప్రసాదుల పాద యాత్ర.. వీళ్లకు పిల్ల దొరికేనా !!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News