Home Lifestyle Health Norovirus | కేరళలో మరోసారి నోరో వైరస్‌ కలకలం.. దీని లక్షణాలేంటి.. వైరస్‌ సోకితే ప్రాణాలకు...

Norovirus | కేరళలో మరోసారి నోరో వైరస్‌ కలకలం.. దీని లక్షణాలేంటి.. వైరస్‌ సోకితే ప్రాణాలకు ముప్పు ఉంటుందా ?

Norovirus | కేరళలోని కొచ్చిలో నోరో వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. కక్కనాడ్‌లోని ఓ స్కూలులోని 19 మంది పిల్లలకు ఈ వైరస్‌ సోకినట్లు వైద్య అధికారులు నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు సెలవులు ఇచ్చారు. వ్యాధి విస్తరించకుండా అడ్డుకునేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు మొదలుపెట్టింది. ఇంతకీ ఈ వైరస్‌ సోకిన వారిలో లక్షణాలు ఎలా ఉంటాయి ? వైరస్‌ విస్తరించడానికి కారణాలేంటి అనే విషయాలను ఓ సారి చూస్తే..

కలుషిత నీరు, ఆహారం ద్వారా ఈ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ సోకిన వారి పాత్రలు, దుస్తులు ఉపయోగించినా, ఆహారం పంచుకున్నా, వారు కూర్చున్న ప్రాంతాన్ని తాకడం ద్వారా కూడా నోరో వైరస్‌ ఇతరుల శరీరంలోకి ప్రవేశిస్తుంది. పలు దేశాల్లో దీన్ని స్టమక్‌ ఫ్లూ, స్టమక్‌ బగ్‌ అని కూడా పిలుస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా నోరో కేసులు ఏటా కోట్లలో నమోదవుతాయి. ఎక్కువగా పదేళ్ల చిన్నారులకే ఈ వైరస్ సోకే అవకాశం ఎక్కువ. డయేరియాకు కారణమయ్యే రోటా వైరస్‌ మాదిరిగానే నోరో వైరస్‌ లక్షణాలు కూడా ఉంటాయి. నోరో వైరస్‌ సోకిన 12 నుంచి 48 గంటల్లో లక్షణాలు మొదలై 3 రోజుల పాటు ఉంటాయి.

లక్షణాలేంటి

నోరో వైరస్‌ సోకిన వారిలో వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు కూడా ఉంటాయి. దీని ప్రభావం ఎక్కువగా ఉంటే మాత్రం డీ హైడ్రేషన్‌కు దారి తీస్తుంది. ఈ వైరస్‌ సోకిన వాళ్లలో 92 శాతం మంది ఇంటి వద్దే కోలుకుంటారు. డీహైడ్రేషన్‌కు గురైన వాళ్లు మాత్రం ఆస్పత్రిలో చేరాల్సి రావొచ్చని వైద్యులు చెబుతున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Cancer | చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే కేన్సర్‌ను నిరోధించే ఛాన్స్‌.. ఏం చేయాలి !

Corona Cases | చైనాలో కరోనాతో వారంలో 13వేల మంది మృతి.. ఇంకా రోజుకు 30 వేల మరణాలు ఉంటాయని అంచనా!

covid19 | కరోనా సోకిన వాళ్లు 18 నెలల వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే.. లేదంటే ప్రాణాలకే ముప్పు

Covid 19 | చైనాలో 30 రోజుల్లో 60వేల మంది కరోనాతో మృతి.. ఎట్టకేలకు నోరువిప్పిన అధికారులు

Ban on Gas stoves | చిన్న పిల్లల్లో పెరుగుతున్న అస్తమా.. గ్యాస్ స్టౌవ్ బ్యాన్ చేసే యోచనలో అమెరికా?

Diabetes | ఈ జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహాన్ని జయించొచ్చు.. ఏంటవి?

Heart Attack | ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటు అని అనుమానించాల్సిందే.. అస్సలే ఆలస్యం చేయొద్దు

Exit mobile version