Friday, March 29, 2024
- Advertisment -
HomeLifestyleDo you knowMosquito bites | దోమలు కొంతమందినే కుడుతాయి? ఎందుకని ఎప్పుడైనా గమనించారా?

Mosquito bites | దోమలు కొంతమందినే కుడుతాయి? ఎందుకని ఎప్పుడైనా గమనించారా?

Mosquito bites | మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక నలుగురు వ్యక్తులు ఒక్క చోట కూర్చొంటే కొంతమందిని మాత్రమే దోమలు కుడుతుంటాయి. దీనివల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ ఆ పక్కన ఉన్నవాళ్లకు అస్సలు ఏం అనిపించదు. దోమలు ఎక్కడ ఉన్నాయి అసలు అని కూడా అంటుంటారు. ఇలాంటి పరిస్థితి మనలో చాలామంది ఎదుర్కొనే ఉంటారు. మరి ఎప్పుడైనా ఆలోచించారా? కొంతమందినే దోమలు ఎక్కువగా కుట్టడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

దోమలకు పగటి పూట కళ్లు సరిగ్గా కనబడవు. చీకటి పడుతున్నా కొద్దీ వాటికి కళ్లు బాగా కనిపిస్తాయి. అయితే దోమలు ఇంట్లోకి రాగానే ముదురు రంగు బట్టలు వేసుకున్న వాళ్లకు ఎక్కువగా ఆకర్షితమవుతాయి. ముఖ్యంగా నేవీ బ్లూ, రెడ్‌ కలర్‌ బట్టలకు దోమలు ఎక్కువగా ఆకర్షించబడుతాయి. కాబట్టి వాళ్లనే దోమలు ఎక్కువగా కుడతాయి..

బరువు ఎక్కువగా ఉండేవాళ్లను కూడా దోమలు అధికంగా కుడుతుంటాయి. దీని వెనుక శాస్త్రీయ కారణం ఉంది. అదేంటంటే.. కార్బన్‌ డయాక్సైడ్‌ వాసనను 160 అడుగుల దూరం నుంచి కూడా దోమలు పసిగట్టగలవు. ఆ వాసన ద్వారానే దోమలు మనుషుల దగ్గరకు వస్తాయి. అయితే లావుగా, అధిక బరువుతో ఉన్నవాళ్లు జీవక్రియ కోసం ఎక్కువగా ఆక్సిజన్‌ పీల్చుకుని.. అంతేస్థాయిలో కార్బన్‌ డయాక్సైడ్‌ను వదులుతారు. కాబట్టి అధిక బరువు ఉన్నవారి దగ్గరకు దోమలు తొందరగా వస్తాయి.

గర్భిణులు కూడా కార్బన్‌ డయాక్సైడ్‌ను ఎక్కువగా వదిలేస్తుంటారు. గర్భంతో ఉన్న మహిళలను దోమలు ఎక్కువగా కుట్టడానికి కూడా కారణం ఇదే. ఆఫ్రికాలో గర్భిణులకు మలేరియా ఎక్కువగా సోకుతున్నట్టు ఆమధ్య ఒక పరిశోధనలో తెలిసింది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే గర్భిణులను 21 శాతం ఎక్కువగా దోమలు కుడతాయి.

ఎక్కువగా చెమటతో ఇబ్బంది పడేవారిని దోమలు ఎక్కువగా కుడతాయి. దీనికి కారణమేంటంటే.. మానవ శరీరం నుంచి వచ్చే చెమటలో లాక్టిక్‌ యాసిడ్‌, యూరిక్‌ యాసిడ్‌, అమ్మోనియా వంటి లవణాలు ఉంటాయి. వీటికి దోమలు ఎక్కువగా ఎట్రాక్ట్‌ అవుతాయి. కాబట్టి ఎక్కువగా కష్టపడి చెమటపోసే వారి వద్దకు దోమలు తొందరగా వస్తుంటాయి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Lemon juice | చలికాలంలో నిమ్మ రసం తాగితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

Cold remedies | చలికాలంలో జలుబు, దగ్గుతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలు మీకోసమే..

Mosquitoes | మీ ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉందా ? ఈ వంటింటి చిట్కాలతో చెక్‌ పెట్టొచ్చు.. అదేలాగంటే ?

Padmasana | పద్మాసనం ఎలా వేయాలి? ఈ యోగాసనం వేస్తే కలిగే ప్రయోజనాలేంటి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News