Saturday, April 20, 2024
- Advertisment -
HomeLatest NewsSBI | ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్‌.. మీ అకౌంట్‌ నుంచి రూ.147 కట్‌ అయినట్టు మెసేజ్‌...

SBI | ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్‌.. మీ అకౌంట్‌ నుంచి రూ.147 కట్‌ అయినట్టు మెసేజ్‌ వచ్చిందా?

SBI | స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ( ఎస్‌బీఐ ) కస్టమర్లకు అలర్ట్‌. మీ అకౌంట్‌ నుంచి రూ.147.50 కట్‌ అయినట్టు మెసేజ్‌ వచ్చిందో చెక్‌ చేసుకోండి. ఎలాంటి లావాదేవీలు జరపకుండానే ఎస్‌బీఐ యూజర్ల అకౌంట్లలో నుంచి రూ.147.5 డబ్బులు డెబిట్‌ అయిపోతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక చాలామంది అయోమయానికి గురవుతున్నారు. ఏమైందని తెలుసుకునేందుకు కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేస్తున్నారు. కొందరైతే బ్రాంచ్‌లకు వెళ్లి ఆరా తీస్తున్నారు. దీంతో అలా డబ్బులు ఎందుకు కట్‌ అవుతున్నాయో వివరణ ఇచ్చింది.

అకౌంట్‌ నుంచి ఇలా రూ.147.50 డెబిట్‌ అయినట్టు మెసేజ్‌ వస్తే ఆందోళన పడాల్సిన అవసరం బ్యాంకింగ్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. ఏటీఎం/డెబిట్‌ కార్డు మెయింటేనెన్స్‌ చార్జీల కింద ఆ మొత్తాన్ని కట్‌ చేస్తున్నాయి. ఎస్‌బీఐ కస్టమర్లు ఉపయోగించే తమ డెబిట్‌ కార్డు వార్షిక రుసుము రూ.125 విధిస్తుంది. దానికి 18% జీఎస్టీ కలుపుకుంటే రూ.147.50 అవుతుంది. ఈ మొత్తాన్నే ఎస్‌బీఐ ఖాతాదారుల నుంచి డెబిట్‌ చేస్తుంది. ఇక కొత్త డెబిట్‌ కార్డు జారీ చేసేందుకు రూ.300 ( జీఎస్టీ అదనం ) ఛార్జి చేస్తుంది.

ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ కింద వివిధ క్రెడిట్‌ కార్డు సంబంధిత లావాదేవీలపై విధించే అడిషినల్‌ ఛార్జీలను కూడా సవరించింది. 2022 నవంబర్‌ 15 తర్వాత నుంచి అన్ని రెంటల్‌ పేమెంట్స్‌పై రూ.99 (జీఎస్టీ అదనం) ప్రాసెసింగ్‌ ఫీజు విధిస్తున్నట్టు ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. అలాగే అన్ని మర్చంట్‌ ఈఎంఐ ట్రాన్సక్షన్స్‌పై ఉన్న ప్రాసెసింగ్‌ ఫీజును రూ.99 నుంచి రూ.199( పన్నులు అధికం )కి పెంచింది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

CIBIL SCORE | బ్యాంకు లోన్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీ సిబిల్ స్కోర్ పడిపోకుండా ఇలా జాగ్రత్త పడండి.

Dollar | అన్ని దేశాల కరెన్సీలను డాలర్‌తోనే ఎందుకు పోలుస్తారు.. దీనికి కారణమేంటని ఎప్పుడైనా ఆలోచించారా?

Personal Finance | ఒక వ్య‌క్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అత‌ని సొంత‌మ‌వుతుంది?

Phone Pe | ఫోన్‌ పే, గూగుల్‌ పే వాడుతున్నారా? ఏ యాప్‌ నుంచి ఎంత అమౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చో తెలుసా !

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News