Home Lifestyle Devotional Lakshmi Devi | లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తులసి పూజ ఎలా చేయాలి?

Lakshmi Devi | లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తులసి పూజ ఎలా చేయాలి?

Image by Harryarts on Freepik

Lakshmi Devi | తులసి మొక్కను హిందువులు పవిత్రంగా భావిస్తారు. లక్ష్మీదేవి అంశగా తులసిని కొలుస్తారు. ఇంట్లో పెట్టుకుని ఆరాధిస్తుంటారు. తులసి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని విశ్వసిస్తారు. అంతేకాదు తులసిని పూజించడం వల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతారు. తులసి వనం ఉన్న ఇల్లు పుణ్య తీర్థంతో సమానం అని అనేక శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పూజ మహిళలకు అత్యంత శుభప్రదం. ఉదయం, సాయంత్రం తులసి కోట చుట్టూ దీపారాధన చేయాలి. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు.అయితే తులసిని ఎలా పూజించాలి అనే దానిపై కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

తులసి పరిక్రమ నియమాలు

తులసికి క్రమం తప్పకుండా పూజలు చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ఆ ఇంట్లో వారంతా సుఖసంతోషాలతో ఉంటారు.

క్రమం తప్పకుండా తులసికి శుభ్రమైన నీటిని సమర్పించడం ద్వారా లక్ష్మీ దేవి సంతోషిస్తుంది.

ఎప్పుడు పడితే అప్పుడు తులసికి నీళ్లు పోయకూడదు. ఉదయాన్నే స్నానమాచరించి శుభ్రమైన బట్టలు వేసుకున్న తర్వాతనే నీళ్లు పోయాలి.

నీరు పోసిన తర్వాత తులసి మొక్క చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా నీటిని సమర్పించాలి.

ఒకవేళ తులసి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ఇంట్లో స్థలం లేకపోతే.. నీళ్లు పోసి అక్కడే మూడు చుట్టూ తిరిగితే సరిపోతుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

Exit mobile version