Saturday, April 20, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuVaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి...

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Vaastu Dosha | ఒక ఇంటికి వాస్తు చాలా ముఖ్య‌మ‌ని పెద్దలు చెబుతుంటారు. వాస్తు బాగుంటేనే ఇంట్లో ఉండేవారికి ఆరోగ్యం బాగుంటుంది. అష్టఐశ్వ‌రాలు సిద్ధిస్తాయ‌ని తాత‌ల కాలం నాటి నుంచి విశ్వ‌సిస్తున్నారు. అయితే చాలామంది ఇల్లు లేదా ఫ్లాట్ కొన్న త‌ర్వాతనో లేదా.. ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడో ఇంటికి వాస్తు దోషాలు ఉన్నాయేమోన‌ని చూపిస్తుంటారు. కానీ అది క‌రెక్ట్ కాదు. స్థ‌లం కొని ఇల్లు క‌ట్ట‌డానికంటే ముందే వాస్తు చెక్ చేసుకోవ‌డం మంచిది. అయితే వాస్తు దోషాలు ఏర్ప‌డ‌టానికి ముఖ్యంగా మూడు కార‌ణాల‌ను చెబుతుంటారు.

మొద‌టిది.. స్థ‌లం కొనేముందే అక్క‌డి భూమిని ప‌రీక్ష చేయించాలి. భూమి సార‌వంతంగా లేక‌పోతే ఇల్లు క‌ట్ట‌డానికి అనుకూలంగా ఉండ‌దు. భూమి గట్టిగా ఉంటేనే అక్క‌డ క‌ట్టిన ఇల్లు దృఢంగా ఉంటుంది. అలాగే ఆ స్థలం అడుగున ఏవైనా ఆల‌యాలు, జ‌ల నాడులు, దుష్ట‌శ‌క్తుల ఆవాహన ఉందో చెక్ చేసుకోవాలి. అలా ఉన్న స్థ‌లంలో ఇల్లు క‌డితే సంతోషంగా ఉండ‌లేం. స్థ‌లంతో పాటు ఆ ప‌రిస‌రాలు ఎలా ఉన్నాయి.. అక్క‌డి మ‌నుషుల వాతావ‌ర‌ణం ఎలా ఉంద‌నేది కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి.

రెండోది.. ఇల్లు క‌ట్టే స‌మ‌యంలో య‌జ‌మాని పేరు, న‌క్ష‌త్రాన్ని బ‌ట్టి ఇంటికి ఎన్ని గుమ్మాలు, కిటికీలు ఉండాలి.. అవి ఏ దిశ‌లో ఉంటే మంచిద‌నే విష‌యాల‌ను వాస్తు నిపుణుల‌ను సంప్ర‌దించాలి. ఆ ప్ర‌కార‌మే వాటిని క‌ట్టాలి. అలా అన్ని వాస్తు ప్ర‌కారం క‌ట్టిన త‌ర్వాత ఆ ఇంట్లో ఉన్నా మ‌న‌శ్శాంతి లేక‌పోతే దానికి మ‌న ప్ర‌వ‌ర్త‌న కార‌ణం కావ‌చ్చు. ఏంట్లో స్త్రీల‌కు అన్యాయం జ‌రుగుతుందో ఆ ఇంటికి వాస్తు దోషం ఉంద‌ని చెబుతుంటారు. జీవ‌హింస‌, వృద్ధులు బాధ‌ప‌డే ఇంట్లో ఉన్న కూడా వాస్తు దోషం ఉన్న‌ట్లేన‌ట. అలాంటి ఇంట్లో ఉంటే సుఖ‌శాంతులు ఉండ‌వు. ఇలాంటి హింస జ‌రిగే చోట వాస్తు దోష నివార‌ణ‌కు ఎన్ని మార్పులు చేసినా ప‌రిస్థితి మార‌దు. మ‌న ప్ర‌వ‌ర్త‌న‌లో దోషం ఉంటే.. ఏ ఇంటికి వెళ్లిన మ‌న‌శ్శాంతి దొర‌క‌దు.

కొన్నిసార్లు వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఏ దోషం క‌నిపించ‌దు. కానీ కొత్త ఇంట్లోకి మారిన‌ప్ప‌టి నుంచి అకార‌ణంగా చికాకులు, మాటిమాటికి అనారోగ్యానికి గుర‌వ‌డం జ‌రుగుతుంది. ఎప్పుడూ ప్ర‌శాంత‌త ఉండ‌దు. జాత‌కం ప్ర‌కారం కూడా ఎలాంటి దోషం క‌నిపించ‌దు. ఇలాంటి స‌మ‌యంలో వాస్తులో లోపం ఉంద‌ని చెబుతారు. అదెలా అంటే.. మ‌న శ‌రీరానికి అయ‌స్కాంత శ‌క్తి ఉంటుంది. ఇది మ‌నం ఉన్న స్థ‌లాన్ని బ‌ట్టి మ‌న‌పై ప్ర‌భావం చూపిస్తుంది. మ‌న‌కు స‌రిప‌డ‌ని ప్ర‌దేశాల‌కు వెళ్లిన‌ప్పుడు ఆ ప్ర‌భావం మ‌న మీద ప‌డి త‌ల‌తిర‌గ‌డం, త‌ల‌నొప్పి, చికాకు, వంటి ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. ఇవే కాకుండా పెంపుడు కుక్క‌డు ఎప్పుడూ ఒకే వైపు తిరిగి అర‌వ‌డం, ఇంట్లోకి పాములు, గ‌బ్బిలాలు రావ‌డం కూడా వాస్తు లోపానికి సంకేతాలే. కేవ‌లం ఒకే ఇంటి చుట్టూ మాత్ర‌మే కాకులు ప్ర‌ద‌క్ష‌ణ చేయ‌టం కూడా వాస్తు లోపమే.

Follow Us : Facebook, Twitter

Read More Articles |

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

ఒక వ్య‌క్తి ఎన్ని ఏళ్లు కిరాయి ఉంటే ఆ ఇల్లు అత‌ని సొంత‌మ‌వుతుంది?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News