Friday, April 26, 2024
- Advertisment -
HomeLifestyleHealthSleep | మనిషికి ఎన్నిగంటల నిద్ర సరిపోతుంది?

Sleep | మనిషికి ఎన్నిగంటల నిద్ర సరిపోతుంది?

Sleep | చాలామంది ఉరుకుల పరుగుల జీవితంలో కంటినిండా నిద్ర కూడా పోవడం లేదు. ఆఫీసులో డ్యూటీ, ఇంటికి రాగానే టీవీ, సెల్‌ఫోన్లు.. ఇవే ఇప్పుడు లోకం అయిపోయాయి. కానీ మనిషికి ఉద్యోగం, ఆహారం ఎలాగో నిద్ర అంతకుమించి అంటున్నాయి అనేక అధ్యయనాలు. కంటినిండా నిద్రలేకుంటే ప్రాణాలకు ప్రమాదమని నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే.. మనిషికి ఎన్నిగంటల నిద్ర సరిపోతుంది?

నిద్ర సరిగా పోని వారితో పోలిస్తే కంటినిండా నిద్ర ఉన్నవారు చాలా చురుగ్గా ఉంటారు. వేగంగా ఆలోచించగలుగుతారు. రోజూ నిద్రలేకుండా సెల్‌ఫోన్లు, టీవీలు అంటూ కాలక్షేపం చేస్తే ఆసలుకే మోసం వస్తుంది. తగినంత నిద్రలేకుంటే ఆలోచించే శక్తి, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. పగలంతా దేనిమీదా దృష్టి కేంద్రీకరించలేరు. నిద్రలేకుండా వాహనాలు నడిపే వారు రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం మనిషికి ఏడున్నర నుంచి 8 గంటల నిద్ర
అవసరం. చాలామంది పరోధకులు, వైదులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.

ఏ వయసు వారికి ఎంత నిద్ర అవసరం?

సాధారణంగా నవ జాత శిశువులకు ఎక్కువ నిద్ర అవసరం. 0-2 నెలల్లోపు పిల్లలకు రోజుకు 12 నుంచి 18 గంటల నిద్ర అవసరమవుతుంది. ఇక 3 నుంచి 11 నెలల్లోపు పిల్లలకు 14 నుంచి 15 గంటల నిద్ర అవసరం. ఏడాది నుంచి మూడేండ్ల పిల్లలకు మాత్రం 11 నుంచి 13 గంటల నిద్ర సరిపోతుంది. ఐదు నుంచి పదేండ్ల పిల్లలకు 10 నుంచి 11 గంటల నిద్ర అవసరం. పది నుంచి 17 ఏండ్ల వరకు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిదిన్నర గంటలు అసవరం. 17 ఏండ్ల పైబడిన వారందరికీ 7 నుంచి 9 గంటల నిద్ర కచ్చితంగా ఉండాల్సిందేనని వైద్యులు, పరిశోధకులు స్పష్టం చేశారు.

నిద్రలేమితో నష్టాలివి..

రోగనిరోధక వ్యవస్థ మందగిస్తుంది. టైప్‌ 2 మధుమేహం వచ్చే ప్రమాదం ఉటుంది. ముఖ్యంగా ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది. గుండె పనితీరులో మార్పులు వస్తాయి. గుండె వేగంగా కొట్టుకోవడంతో పాటు.. హృద్రోగాలు ముప్పు పొంచి ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి చిరాకు పడతారు. కొత్త విషయాలు నేర్చుకోవాలన్న తపన ఉండదు. జ్ఞాపకశక్తి తగ్గిపోయి.. మతిమరుపు వచ్చే అవకాశం ఉంటుంది. విపరీతంగా ఆవులింతలు వస్తుంటాయి కాబట్టి ఏ పనిపైనా సరిగా దృష్టి పెట్టలేరు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Obesity | అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? రాత్రివేళలో భోజనానికి బదులు వీటిని తీసుకోండి..

Tips to sleep | బోర్లా పడుకుంటే ప్రమాదమా.. ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టేనా ? వైద్యులు ఏం చెబుతున్నారు?

Wrinkles | న‌లభై ఏళ్లకే శరీరం ముడతలు పడుతోందా.. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.. !

Beauty tips for lips | చ‌లికాలంలో పెద‌వులు అందంగా కనిపించాలా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News