Home Lifestyle Horoscope & Vaasthu Rent House | కొత్తగా ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారా? ఈ వాస్తు దోషాలు ఉన్నాయో లేదో...

Rent House | కొత్తగా ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారా? ఈ వాస్తు దోషాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోకుంటే అప్పుల్లో కూరుకుపోవాల్సిందే!

Rent House | సొంతంగా ఇంటిని కట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. మనకు నచ్చినట్టుగా అన్ని సౌకర్యాలు ఉండేలా ఇల్లు కట్టుకుంటాం. అదే సమయంలో ఇంట్లో ఉండేవాళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇంట్లో అష్టైశ్వర్యాలు విలసిల్లాలని అన్ని వాస్తు ప్రకారం కట్టుకుంటాం. ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా జాగ్రత్త పడతాం. సొంతిల్లు అంటే మనకు నచ్చినట్టు కట్టుకుంటాం. మరి అద్దె ఇంట్లో ఉంటే పరిస్థితి ఏంటి? మన జీవితం సుఖవంతంగా సాగాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే కొన్ని వాస్తు సూచనలు పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాటిని పాటిస్తే అంతా మంచిదే జరుగుతుందని లేదంటే.. అప్పుల్లో కూరుకుపోతారని.. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యానికి గురవుతారని హెచ్చరిస్తున్నారు. మరి అన్ని అనుకూలంగా జరగాలంటే ఎలాంటి వాస్తు టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ఈశాన్య, నైరుతి దిశల్లో కిచెన్ ఉండకూడదు. బెడ్రూం విషయానికొస్తే నైరుతి దిశలోనే ఉండాలి. అలాగే మెయిన్ డోర్ ఉత్తర దిశగా ఉంటే మంచిది.
  • ఈశాన్య దిశలో టాయిలెట్లు ఉండకూడదు. మరుగుదొడ్లు పడమర వైపు మాత్రమే ఉండాలి. అలా లేకుంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
  • కొత్తగా అద్దెకు తీసుకున్న ఇంట్లో విరిగిపోయిన ఫర్నీచర్ ఉంచకూడదు. పగిలిపోయిన ఫొటోలు, అద్దాలు కూడా ఉంచుకోవద్దు. అనవసర వస్తువులు ఉంటే అవి ప్రతికూల ఆలోచనలు పెంచుతాయి.
  • పాజిటివ్ ఎనర్జీని పెంచే ఫొటోలను మాత్రమే ఇంట్లో ఉంచుకోవాలి. సానుకూల చిత్రాలు అంటే పర్వతాలు, సూర్యుడు, జలపాతాలు వంటి ఫొటోలను ఉంచుకోవాలి.
  • ఇంట్లో దీపధూపాలను వెలిగించాలి.
  • శ్మశాన వాటిక, హాస్పిటల్, ట్రాఫిక్, రద్దీ ఉండే ప్రాంతాలకు సమీపంలో కూడా ఇల్లు అద్దెకు తీసుకోవద్దు.
  • మొబైల్ టవర్, విద్యుత్ స్తంభం ఉన్న ప్రదేశాల్లోకి దగ్గరలో కూడా ఇల్లు అద్దెకు తీసుకోవడం మంచిది కాదు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Exit mobile version