Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు (26-04-2023)

Horoscope Today | రాశిఫలాలు (26-04-2023)

Image Source : Pixabay

Horoscope Today | మేషం

పనుల్లో ఆటంకాలు ఏర్పడినా అధిగమిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ప్రయాణాలు చేస్తారు. ఇంటాబయట చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. స్వల్ప ధన లాభ సూచన ఉంది.

వృషభం

బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. తలపెట్టిన కార్యాలు నెరవేరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంతానం నూతన ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంది.

మిథునం

సంఘంలో ఆదరణ పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. షేర్లు, భూముల క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

కర్కాటకం

రుణాలు కొంతవరకు తీరుస్తారు. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. ఇంటాబయట బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తి చేస్తారు.

సింహం

పరిచయాలు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వృద్ధి చేసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో ఎదురైన చికాకులు తొలగించుకుంటారు.

కన్య

నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

తుల

బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు.

వృశ్చికం

మిత్రుల నుంచి ఒత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఇంటాబయట చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.

ధనుస్సు

సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సోదరుల నుంచి ధనలాభం పొందుతారు. భూ, వాహనయోగం పొందుతారు.

మకరం

కుటుంబ సభ్యుల్లో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. ఉద్యోగులకు పదోన్నతి పొందే సూచన ఉంది. వస్తువులు కొనుగోలు చేసే సూచన ఉంది.

కుంభం

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. సన్నిహితుల నుంచి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. మీలోని ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

మీనం

వ్యవహారాల్లో ఎదురైనా మిత్రుల సాయం అందుతుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ధనలాభ సూచన ఉంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Exit mobile version