Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు (20-05-2023)

Horoscope Today | రాశిఫలాలు (20-05-2023)

Image Source : Pixabay

Horoscope Today | మేషం:

సంఘంలో గౌరవం పొందుతారు. దీర్ధకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు. విందు, వినోదాలు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. నూతన వస్తు కొనుగోలు. Horoscope Today

వృషభం:

ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. రుణాలు తీరి ప్రశాంతత పొందుతారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. వాహన సౌఖ్యం.

మిథునం:

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. శ్రమ తప్ప ఫలితం ఉండదు. జీవిత భాగస్వామి నుండి థన లాభం పొందుతారు. వ్యత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. స్వత్పనన లాభం.

కర్కాటకం:

స్థిరాస్థి వివాదాలు తీరుతాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సోదరులతో ఏర్పడిన వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు పొందుతారు.

సింహం:

ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. వస్తు, వస్తా లాభాలు పొందుతారు.

కన్య:

బంధువులతో వఏర్షడిన ఆస్తి తగాదాలు పరిష్కారమై నూతన ఒప్పందాలు కుదురుతాయి. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు.

తుల:

మిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. విందు, వినోదాలు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వస్తు లాభం.

వృశ్చికం:

వృత్తి, వ్యాపారాలలో ఎదురైన చికాకులు కొంత వరకు తీరుతాయి. అనుకోని నమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక ఇబ్బందులు కొంత వరకు తీరుతాయి. సోదరుల నుండి ధన లాభం.

ధనుస్సు:

ప్రముఖుల కలయిక. విందు, వినోదాలు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. సంతానంనాకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.

మకరం:

రుణాల నుండి విముక్తి పొందుతారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. అనుకోని ఆహ్వానాలు అందును.

కుంభం:

పనులలో ఆటంకాలు ఎదురై చికాకులు కొంత వరకు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. కుటుంబ సభ్యుల నుండి సహాయసహకారాలు అందుతాయి. వివాదాలకు దూరంగా వుండండి. ప్రయాణాలు లాభిస్తాయి.

మీనం:

అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. పట్టుదల పెరుగుతుంది. సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమైన ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. కాంట్రాక్టులు లాభిస్తాయి. వస్తు లాభం.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Exit mobile version