Friday, April 19, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు 18-10-2022

Horoscope Today | రాశిఫలాలు 18-10-2022

Horoscope Today | మేషం

ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. రావాల్సిన డబ్బు పాక్షికంగా చేతికందుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. శుభకార్యాల కారణంగా ఖర్చులు పెరుగుతాయి

వృషభం

ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు పై చదువుల కోసం విదేశాల నుంచి అవకాశాలు రావచ్చు. పాత బాకీలు వసూలు కావడంలో ఆలస్యం ఉంటుంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది

మిథునం

ఈ రోజు ఈ రాశివారు ఉత్సాహంగా పనిచేస్తారు. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికందుతుంది. దీనివల్ల వ్యాపార విస్తరణ పనులు ఆలస్యం కావచ్చు. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి.

కర్కాటకం

శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ద చూపుతారు. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. ప్రారంభించిన పనులు ఆలస్యంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలు కలిసివస్తాయి.

సింహం

వ్యవసాయ భూముల కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అన్నదమ్ముల బంధువర్గంతో మనస్పర్థలు రావచ్చు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. కొత్త వ్యాపారాలు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. వాహనం మూలంగా ఖర్చు పెరుగుతుంది.

కన్య

శుభవార్తలు వింటారు. పనిభారంగా పెరిగినా సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ పనులు కలిసివస్తాయి. ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది. ఆస్తుల విషయంలో తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. రావాల్సిన డబ్బు చేతికందుతుంది.

తుల

శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. నూతన ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి, భూ వివాదాలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు.

వృశ్చికం

కష్టానికి తగిన ఫలం ఉంటుంది. ఆస్తి వివాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. రావాల్సిన డబ్బు చేతికందడంలో జాప్యం జరగవచ్చు. ఉత్సాహంగా ఉంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

ధనుస్సు

రావాల్సిన డబ్బు చేతికందుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికలావాదేవీల్లో జాగ్రత్త వహిస్తారు. ఆస్తి వివాదాలు పాక్షికంగా పరిష్కారమవుతాయి. బంధువులు, మిత్రుల వల్ల ఖర్చు పెరగవచ్చు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. నూతన పెట్టుబడులు వాయిదా వేసుకుంటారు.

మకరం

ఈ రోజు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది.రావల్సిన డబ్బు చేతికందుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఇంట్లో వాతావరణం సంతృప్తిగా ఉంటుంది. ఆత్మీయుల రాకతో ఖర్చు పెరుగుతుంది. ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది.

కుంభం

ఈరోజు కలిసివస్తుంది. నలుగురిలో మంచి పేరు లభిస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు ఆఫీసులో అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్, స్థాన చలన సూచనలున్నాయి.

మీనం

సమాయానికి పనులు పూర్తి చేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అనవసర ఖర్చులు ముందుకు రావచ్చు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు కలిసివస్తుంది. సంయమనం, ఏకాగ్రత అవసరం. శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం లభిస్తుంది. తీర్థయాత్రలకు ప్రయత్నాలు కొనసాగుతాయి.

Follow Us : FacebookTwitter

Read More Articles |

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Vaasthu Tips | ఈ చెట్లు మీ ఇంట్లో ఉంటే ఆర్థికంగా నష్టపోవడం ఖాయం

Vaasthu Tips | కొత్త ఇల్లు కొనేముందు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News