Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Daily | రాశిఫలాలు (21-04-2023)

Horoscope Daily | రాశిఫలాలు (21-04-2023)

Image Source : Pixabay

Horoscope Daily | మేషం

ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. వస్తు లాభం పొందుతారు.

వృషభం

దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందం కలుగజేస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడులకు తగిన సమయం. షేర్లు, భూముల క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

మిథునం

ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. షేర్లు, భూముల క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

కర్కాటకం

ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.

సింహం

నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. విలువైన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వామన యోగం కలదు.

కన్య

బంధువుల నుంచి వచ్చిన వార్త ఆశ్చర్యపరుస్తుంది. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. అనుకోని అతిథుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

తుల

శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ముఖ్యమైన నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సంతానం చేయు నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు.

వృశ్చికం

బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. సోదరుల నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు.

ధనుస్సు

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. కొత్త మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. సంతానం నుంచి కీలక సమాచారం అందుకుంటారు. స్వల్ప ధన, వస్తు లాభం పొందుతారు.

మకరం

వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విలువైన వస్తు, వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

కుంభం

కుటుంబంలోఎదురైన చికాకులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.

మీనం

ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.

Follow Us :  Google News and FacebookTwitter

Read More Articles:

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

vaasthu tips | ఇంటిపై గుడి నీడ పడితే ఏమవుతుంది?

Vaastu Dosha | వాస్తు దోషాల‌ను ముందుగానే ఎలా గుర్తించాలి? ఇల్లు క‌ట్టే ముందు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

Exit mobile version