Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు (26-01-2023 )

Horoscope Today | రాశిఫలాలు (26-01-2023 )

Image Source : Pixabay

Horoscope Today | మేషం

ప్రయాణాలు లాభిస్తాయి. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పారిశ్రామిక కళారంగాల్లో వారికి సన్మాన యోగం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి.

వృషభం

శ్రమ అధికం. పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వ్యాపారాల్లో మిత్రుల సహయం అందుతుంది. జీవిత భాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు.

మిథునం

అనుకోని అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి. ముఖ్యమైన వ్యక్తులను కలిసి సహాయం పొందుతారు. ఉద్యోగ, వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. క్రయవిక్రయాల్లో లాభం పొందుతారు. సోదరుల నుంచి ధన, వస్తు లాభం అంఅందుకుంటారు.

కర్కాటకం

పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు.

సింహం

ఇంటర్వ్యూల్లో తొందరపాటు వద్దు. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు ఎదురై చికాకులు పెట్టినా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి.

కన్య

జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. సన్నిహితుల సహాయసహకారాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.

తుల

మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది.

వృశ్చికం

బంధువుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి లాభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. సంతానం నుంచి ధన, వస్తు లాభం పొందుతారు. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.

ధనుస్సు

పనుల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయం అందుకుంటారు. ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి. ఇంటర్వ్యూల్లో తొందరపాటు వద్దు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన వస్తు కొనుగోలు సూచన ఉంది.

మకరం

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. ఉద్యోగాల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. పెట్టుబడులకు తగిన సమయం.

కుంభం

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. జీవిత భాగస్వామి నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆహ్వానాలు అందుకుంటారు.

మీనం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. వృత్తి, వ్యాపారాల్లో ఏర్పడిన అవరోధాలు కొంతవరకు తొలగుతాయి. జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

Exit mobile version