Friday, March 29, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope today | రాశిఫలాలు (24-12-2022)

Horoscope today | రాశిఫలాలు (24-12-2022)

Horoscope today | మేషం

కుటుంబ సమస్యలు ఎదురై చికాకులు పెట్టినా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో కొత్త మిత్రులు పరిచయం అవుతారు. పెట్టుబడులకు స్వల్ప లాభాలు పొందుతారు. సంతానం నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు.

వృషభం

నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి.

మిథునం

నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుస్తారు. పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం పొందుతారు.

కర్కాటకం

ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కదు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

సింహం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు.

కన్య

మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగాల్లో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.

తుల

శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆస్తివివాదాలు తీరి లబ్ధి పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు. క్రయవిక్రయాల్లో లాభాలు అందుకుంటారు.

వృశ్చికం

బంధువుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. వస్తు లాభ సూచన ఉంది.

ధనుస్సు

మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సాంకేతిక విద్య అవకాశాలు అందుకుంటారు.

మకరం

కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్య, ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి.

కుంభం

దీర్ఘకాలిక సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సహాయసహకారాలు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. సోదరులను కలుసుకుంటారు.

మీనం

ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వాహన యోగ సూచన ఉంది. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం పొందుతారు. క్రయవిక్రయాల్లో లాభాలు అందుకుంటారు. వస్తు లాభ సూచన ఉంది.

Follow Us : FacebookTwitter

Read More Articles |

Advantage of cycle | సైకిల్ గురించి ఈ విశేషాలు తెలుసా? సైకిల్ వాడితే బీపీ, షుగర్ ను కంట్రోల్ చేయొచ్చా?

Household tips | యాపిల్‌ను కోసినప్పుడు రంగు మారిపోతుందా?

Bill gates Phone | బిల్ గేట్స్ ఏ మొబైల్ వాడతారో తెలుసా.. ఐ ఫోన్ మాత్రం అస్సలు కాదు!

Bath in winter | చలికాలంలో వేడినీటి స్నానం చేస్తే మంచిదా? చన్నీటి స్నానమా?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News