Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు (23-02-2023 )

Horoscope Today | రాశిఫలాలు (23-02-2023 )

Image Source : Pixabay

Horoscope Today | మేషం

గృహ సంబంధమైన విషయాల పట్ల దృష్టి సారిస్తారు. సులభంగా కావాల్సిన పనులకు కూడా ప్రయాస పడాల్సి వస్తుంది. దీర్ఘాలోచనలు సాగిస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండటం చెప్పదగినది.

వృషభం

న్యాయంగా మీకు రావాల్సిన ధనాన్ని అందుకోగలుగుతారు. ప్రత్యర్థుల వ్యూహాలకు ప్రతి వ్యూహాలు అమలు చేస్తారు. పర్యవేక్షణ లోపం లేకుండా ప్రతి విషయంలనూ జాగ్రత్త వహించండి

మిథునం

చర్చలు ఫలిస్తాయి. ప్రజా సంబంధాలు మరింత వృద్ధి చెందుతాయి. సామాజిక సేవా కార్యక్రమాలకు చందాలు వసూలు చేస్తారు. కళా సాంస్కృతిక రంగాల పట్ల అభిరుచి కనబరుస్తారు.

కర్కాటకం

అవసరాలకు సరిపడా ధనాన్ని కలిగి ఉంటారు. దూర ప్రాంతంలో నివసిస్తున్న మీ వారి యోగక్షేమాలను తెలుసుకుంటారు వ్యాపారభివృద్ధికై మీరు చేసే ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి.

సింహం

వాస్తవికత ప్రామాణికంగా అడుగులు ముందుకేస్తారు. ఆహార ఆరోగ్య నియమాల పట్ల దృష్టి సారించడం మంచిది. లాభనష్టాలు బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు.

కన్య

దేవాలయాలను సందర్శిస్తారు. ఒత్తిడి తగ్గించుకోవడానికిగానూ బాధ్యతలను ఇతరులకు అప్పగిస్తారు. శుభకార్య చర్చలు సాగిస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తుల

దురలవాట్లకు స్వస్తి చెబుతారు. నిర్మాణాత్మక కార్యక్రమాల్లో చురుకుదనాన్ని తీసుకొస్తారు. లౌక్యంగా వ్యవహరించి కార్యక్రమాలను సానుకూల పరచుకుంటారు. ఆర్థికస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

వృశ్చికం

నూతన పంథాలో వినూత్న వ్యూహాలు అమలు పరుస్తారు. ఆత్మ విమర్శ చేసుకుంటారు. నిజాయితీగా వ్యవహరిస్తారు. ముఖ్యమైన బరువు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

ధనుస్సు

రహస్య సమాచారం వెలుగు చూస్తుంది. మీ అభిప్రాయాల్లో రాజీ ధోరణి ఏర్పడుతుంది. కొనుగోలు అమ్మకాలు సాగిస్తారు. ప్రత్యర్థి వర్గం మీ కన్నా బలహీనంగా ఉండటం లాభిస్తుంది.

మకరం

ఆర్థికాభివృద్ధి సాధించడానికి నూతన మార్గాలు అన్వేషిస్తారు. క్షణం తీరిక లేకుండా గడుపుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు. శ్రమ అధికంగా ఉంటుంది.

కుంభం

ప్రయాణాల్లో మెలకువలు అవసరం. సంఘసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంగీత సాహిత్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. మీకు ఎంతమాత్రం సంబంధం లేని విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు.

మీనం

ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. చిన్నపాటి వివాదాలు ఆదిలోనే పరిష్కరించుకుంటారు. వినోద కార్యక్రమాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. రుచికరమైన ఆహారాన్ని స్వీకరిస్తారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?

Exit mobile version