Home Lifestyle Horoscope & Vaasthu horoscope today | రాశిఫలాలు ( 23-01-2023 )

horoscope today | రాశిఫలాలు ( 23-01-2023 )

Image Source : Pixabay

horoscope today | మేషం

కుటుంబసభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ధన, వస్తు లాభాలు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

వృషభం

ఆరోగ్యం, వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. కోపతాపాలకు దూరంగా ఉండండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖుల నుంచి వచ్చిన ఆహ్వానాలు ఆనందాన్ని కలుగజేస్తాయి.

మిథునం

బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు వద్దు. కాంట్రాక్టులు దక్కుతాయి. జీవిత భాగస్వామి నుంచి ధనలాభం పొందుతారు.

కర్కాటకం

చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సోదరుల నుంచి లాభం పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. సంతాన సమస్యల నుంచి బయటపడతారు. నూతన వస్తు సేకరణకు అవకాశం ఉంది.

సింహం

ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. విద్యార్థులకు విద్య అవకాశాలు పొందే సూచన. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.

కన్య

ఉద్యోగాల్లో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి. మిత్రుల నుంచి సహాయసహకారాలు పొందుతారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం, వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.

తుల

మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పెట్టినప్పటికీ సన్నిహితుల సాయంతో అధిగమిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. స్వల్ప ధనలాభ సూచన ఉంది.

వృశ్చికం

వృత్తి, వ్యాపారాల్లో అనుకూలిస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నూతన మిత్రులు పరిచయమై సహాయసహకారాలు అందుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నూతన పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. భూవివాదాలు పరిష్కారమవుతాయి.

ధనుస్సు

ఉద్యోగాల్లో స్థానమార్పిడి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి.

మకరం

నూతన ప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానం నుంచి కీలక సమాచారం అందుకుంటారు. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది.

కుంభం

ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగాల్లో ఏర్పడిన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. నూతన వస్తు కొనుగోలు సూచన ఉంది.

మీనం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులను కలుసుకుంటారు. సోదరుల నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన వస్తు, వస్త్ర, వాహనాలు కొనుగోలు చేస్తారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Tulsi Puja | గురువారం తులసి చెట్టుకు ఇలా పూజ చేస్తే అప్పుల నుంచి భయటపడతారు

Dreams | స్నానం చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా? దాని అర్థమేంటో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

Exit mobile version