Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు (19-03-2023 )

Horoscope Today | రాశిఫలాలు (19-03-2023 )

Image Source : Pixabay

Horoscope Today | మేషం

ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీలోని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సంతానం నుంచి కీలక సమాచారం అందుతుంది.

వృషభం

మిత్రుల నుంచి ఏర్పడిన ఒత్తిడులు తొలగుతాయి. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. జీవిత భాగస్వామి నుంచి ధన, వస్తు, లాభాలు పొందుతారు. ఆహ్వానాలు అందుకుంటారు.

మిథునం

కోపతాపాలకు తగాదాలకు దూరంగా ఉండటం అన్ని విధాలు మంచిది. రుణాలు కొంతవరకు తీరుతాయి. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. అనుకోని అతిథుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

కర్కాటకం

భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

సింహం

కుటుంబ సభ్యులతో ఏర్పడిన చికాకులు తొలగుతాయి. ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి. తీర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. సోదరుల నుంచి సహాయసహకారాలు అందుతుంది. సోదరుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు.

కన్య

అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. వివాహ, ఉద్యోగ అవకాశాలు కలిసి వచ్చేకాలం ఉంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు.

తుల

ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. అనుకోని అతిథుల కలయిక ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చికం

ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాల్లో విజయం సాధిస్తారు. సంఘంలో మీ మాటకు పలుకుబడి పెరుగుతుంది. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు.

ధనుస్సు

వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పనుల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. సంతానం నుంచి కీలక సమాచారం అందుకుంటారు.

మకరం

కుటుంబసభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. గృహ, వివాహ యత్నాలు సాగిస్తారు. శ్రమకు తగిన ఫలితం కష్టమే. సన్నిహితుల సలహాతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నూతన వస్తు లాభం పొందుతారు.

కుంభం

ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. సోదరులతో ఏర్పడిన విభేదాలతో పరిష్కారమై ఊరట చెందుతారు. ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు.

మీనం

ఆకస్మిక ధన, వస్తు లాభాలుపొందుతారు. పాత మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ప్రముఖులతో సహాయంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. కుటుంబసభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Allu Arjun | అల్లు అర్జున్ ట్విట్టర్‌లో నన్ను బ్లాక్ చేశాడు.. వైరల్‌గా మారిన వరుడు హీరోయిన్ ట్వీట్

Viral News | డంప్‌ యార్డులో అగ్ని ప్రమాదం.. రూ.100 కోట్ల ఫైన్‌ వేసిన ఎన్జీటీ

Viral News | అత్తారిల్లు చాలా దూరంగా ఉంది.. నేను పుట్టింటికి వెళ్లిపోతా.. పెళ్లయిన కాసేపటికే వరుడికి షాకిచ్చిన వధువు

Naveen Murder Case | నవీన్‌ మర్డర్‌ కేసులో కీలక మలుపు.. జైలు నుంచి నిహారిక విడుదల

Naatu Naatu | నాటు నాటు పెడితే కానీ.. నా కొడుకు అన్నం తినడం లేదు.. కరీనా కపూర్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌

Exit mobile version