Thursday, April 25, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope today | రాశిఫలాలు ( 19-01-2023 )

Horoscope today | రాశిఫలాలు ( 19-01-2023 )

Horoscope today |మేషం

రుణ ఒత్తిడులు తొలగి ప్రశాంతత పొందుతారు. ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. కీలక విషయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకుంటారు. నూతన మిత్రులు పరిచయమై కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. నూతన విద్య అవకాశాలు వస్తాయి

వృషభం

బంధువులతో ఏర్పడిన విబేధాలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సహం పొందుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాతో ముందుకు సాగుతారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

మిథునం

నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. సంతానం నుంచి ధన, వస్తు లాభాలు అందుకుంటారు. ఆహ్వానాలు అందుకుంటారు.

కర్కాటకం

ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సన్నిహితుల నుంచి అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు. ధనలాభ సూచన ఉంది.

సింహం

పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. విందు, వినోదాల్లో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వివాహ, ఉద్యోగ యత్నాలకు అనుకూలమైన సమయం. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సాంకేతిక విద్యలో ప్రోత్సాహం అందుతుంది.

కన్య

బంధువుల నుంచి ధనలాభం పొందుతారు. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వాహనాలు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

తుల

భాగస్వామ్య వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం అందుకుంటారు. నూతన ప్రయత్నాల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభం పొందుతారు. సంతానం నుంచి శుభవార్త వింటారు.

వృశ్చికం

భూవివాదాలు తీరి లబ్ది పొందుతారు. శ్రమ అధికం. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిది. కుటుంబంలో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు.

ధనుస్సు

వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. విందులు వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టులు లభిస్తాయి. సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. వస్తు కొనుగోలు సూచన ఉంది.

మకరం

ఉద్యోగులకు పదోన్నతులు పొందే సూచన ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆనందాన్ని కలగజేస్తుంది. నూతన ఒప్పందాలు కుదురుతాయి. కొత్త వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానం నుంచి కీలక సమాచారం అందుకుంటారు . భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి.

కుంభం

ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వివాహ, ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.

మీనం

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి సహాయం అందుకుంటారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. సంఘంలో ఆదరణ పొందుతారు. ధనలాభ సూచన ఉంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Money in Dreams | కలలో డబ్బులు కనిపిస్తే అదృష్టమా? దురదృష్టమా?

Lakshmi Devi | లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తులసి పూజ ఎలా చేయాలి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News