Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు (17-03-2023 )

Horoscope Today | రాశిఫలాలు (17-03-2023 )

Image Source : Pixabay

Horoscope Today | మేషం

ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. వివాహ యత్నాలకు కొంత అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి ఆశ్చర్యకరమైన ఆహ్వానాలు అందుకుంటారు.

వృషభం

పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండటం అన్నివిధాలా మంచిది. గ‌ృహ నిర్మాణ ఆలోచనలు సిద్ధంగా ఉండవు. సోదరుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

మిథునం

ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ముఖ్య నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు.

కర్కాటకం

పనుల్లో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

సింహం

బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆకస్మిక ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయం అవుతారు. ఉద్యోగులకు పని ఒత్తిడులు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ధనలాభం పొందుతారు.

కన్య

ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు చికాకు కలిగిస్తాయి. కుటుంబసభ్యుల సహాయసహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు.

తుల

ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. పనులను సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వాహనాల కొనుగోలు చేస్తారు.

వృశ్చికం

బంధువులను కలిసి ఉత్సాహంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ధనుస్సు

ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు. ప్రయాణాల్లో నూతన మిత్రులు పరిచయం అవుతారు. ఉద్యోగ, వివాహ యత్నాలు సాగిస్తారు.

మకరం

బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. కుటుంబసభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు.

కుంభం

ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయమై నూతన కార్యక్రమాలు చేపడతారు. సోదరుల నుంచి ఆస్తి లాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతారు. ఉద్యోగాల్లో నూతన ఉత్సాహం కలిగి ఉంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.

మీనం

ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం కష్టమే. ఉద్యోగాల్లో స్థాన చలనం ఉంటుంది. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వాహన సౌఖ్యం పొందుతారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Exit mobile version