Home Lifestyle Horoscope & Vaasthu Horoscope Today | రాశిఫలాలు (16-03-2023 )

Horoscope Today | రాశిఫలాలు (16-03-2023 )

Image Source : Pixabay

Horoscope Today | మేషం

నూతన ఉత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. నూతన విద్యావకాశాలు పొందుతారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులు సహకరిస్తారు. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ధనలాభం ఉంది.

వృషభం

పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్యంపట్ల జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. వస్తు లాభం ఉంది.

మిథునం

ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్యాలకు ఉత్సాహంగా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు.

కర్కాటకం

బంధువులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. నూతన మిత్రులు పరిచయమై కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. నూతన పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వివాహ యత్నాలకు అనుకూలమైన సమయం.

సింహం

పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా జీవిత భాగస్వామి సహాయం పొందుతారు. రుణాలు కొంతవరకు తీరుస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయంలో మెలకువ అవసరం. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.

కన్య

ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగులకు స్థాన చలనం ఉండవచ్చు. సంతానం నుంచి కీలక సమాచారం అందుకుంటారు. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

తుల

దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు ఇంక్రిమెంట్లు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభం అందుతుంది.

వృశ్చికం

ముఖ్య వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. తండ్రి నుంచి ఆస్తి లాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ, వివాహ యత్నాలు సాగిస్తారు. అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు.

ధనుస్సు

ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. మిత్రులతో ఏర్పడిన స్వల్ప వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.

మకరం

ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. కోపతాపాలకు దూరంగా ఉండండి. ముఖ్య వ్యవహారాల్లో జాప్యం జరిగినా సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. ఇంటా బయటా సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ధనలాభం పొందుతారు.

కుంభం

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు. వాహన సౌఖ్యం కలదు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు.

మీనం

కుటుంబ సమస్యలు ఎదురైనా జీవిత భాగస్వామి సహాయంతో ముందుకు సాగుతారు. పనుల్లో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. శ్రమ పెరుగుతుంది. నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. స్వల్ప ధన, వస్తు లాభాలు పొందుతారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Devotional | ఆడవాళ్లు కొబ్బరి కాయ ఎందుకు కొట్టవద్దు?

Black Thread | పిల్లల కాలికి నల్లదారం కడుతున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

Shankam | ఇంట్లో శంఖం ఉంచుకోవచ్చా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?

vasthu tips | ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా? ఆర్థికంగా నష్టపోతారు జాగ్రత్త

Ganapati Puja | శని బాధలు తొలగిపోవాలా? బుధవారం నాడు గణపతిని ఇలా పూజించండి

Exit mobile version