Thursday, April 18, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & VaasthuHoroscope Today | రాశిఫలాలు ( 14-03-2023 )

Horoscope Today | రాశిఫలాలు ( 14-03-2023 )

Horoscope Today | మేషం

పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడులు పెరిగినా సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు.

వృషభం

సన్నిహితుల నుంచి ధనలాభం పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందుతారు. అరుదైన అవకాశాలు లభిస్తాయి.

మిథునం

ఉద్యోగ, వివాహ యత్నాలు కలిసి వస్తాయి. మీ మాటకు పరపతి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. క్రయవిక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. వస్తు లాభం కలదు.

కర్కాటకం

దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. ఇంట బయట బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు.

సింహం

ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా అవసరాలకు డబ్బు అందుతుంది. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. వస్తు సేకరణ సూచన ఉంది

కన్య

దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు.

తుల

బంధువుల నుంచి ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వాహన ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. వివాహ యత్నాలు ఫలిస్తాయి.

వృశ్చికం

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా సన్నిహితుల నుంచి సహాయం అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు.

ధనుస్సు

అనుకున్న పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. ఉద్యోగుల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయి.

మకరం

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. భూ, గృహయోగ సూచన కలదు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి.

కుంభం

వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆర్థిక లావాదేవీలు స్వల్ప లాభాలతో ముగుస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు వెళ్తారు. ఉద్యోగ, వివాహ యత్నాలు సాగిస్తారు.

మీనం

నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఉద్యోగంలో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో సంతృప్తికరంగా ఉంటాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Venkatesh Maha | అదో నీచ్ కమీనే స్టోరీ.. కేజీఎఫ్‌ సినిమాపై కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేశ్ మహా సంచలన కామెంట్స్

Janhvi Kapoor | ఎట్టకేలకు టాలీవుడ్‌కు అడుగుపెట్టిన జాన్వీ కపూర్‌.. NTR30 నుంచి అదిరిపోయిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌

Khusboo | నా కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించేవాడు.. తన బాధను వెల్లగక్కిన ఖుష్బూ

Amitabh Bachchan | ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో అప‌శ్రుతి.. అమితాబ్ బ‌చ్చ‌న్‌కు గాయాలు

Balakrishna | బాలయ్య కూడా అదే చేయబోతున్నాడా.. ఆహా కోసం మరో ముందడుగు..!

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News