Wednesday, April 24, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & Vaasthuhoroscope today | రాశిఫలాలు (13-01-2023)

horoscope today | రాశిఫలాలు (13-01-2023)

horoscope today | మేషం

పనుల్లో జాప్యం జరిగినా చివరకు పూర్తి చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. క్రయవిక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో చురుగ్గా పాల్గొంటారు. వస్తు లాభం ఉంటుంది.

వృషభం

మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. జీవిత భాగస్వామి నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి.

మిథునం

కొత్త పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం పొందుతారు. వివాహ, ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన విద్యావకాశాలు పొందుతారు. సంతానం నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు.

కర్కాటకం

శ్రమ అధికం అవుతుంది. బంధువులతో ఏర్పడిన విబేదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. క్రయవిక్రయాల్లో తొందరపాటు వద్దు. స్వల్ప ధనలాభం ఉంది.

సింహం

వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుకోని అతిథుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరుల నుంచి ఆస్తి లాభం పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు.

కన్య

సన్నిహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. నూతన మిత్రులను కలిసి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనుకోని అతిథులను కలుసుకుంటారు

తుల

సంఘంలో గౌరవం పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు, లాభసాటిగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. నూతన వస్తువులు సేకరిస్తారు.

వృశ్చికం

మానసిక ప్రశాంతత లభిస్తుంది. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ధనలాభం పొందుతారు.

ధనుస్సు

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. నూతన కార్యక్రమాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ యత్నాలు కలిసివస్తాయి.

మకరం

కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుతుంది. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంతాన సమస్యల నుంచి బయటపడతారు. వివాహ యత్నాలు కలిసివస్తాయి.

కుంభం

నూతన ఉద్యోగ లాభం పొందుతారు. ప్రముఖులను కలిసి విలువైన సమాచారం తెలుసుకుంటారు. పారిశ్రామిక, రాజకీయ రంగాల్లో వారికి అనుకోని సన్మానాలు, ఆహ్వానాలు అందుతాయి. గృహ నిర్మాణాలు కలిసివస్తాయి. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. ధనలాభం ఉంటుంది.

మీనం

ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆప్తులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. భూవివాదాలు పరిష్కారం అవుతాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Water in Dreams | కలలో తరచూ నీళ్లు కనిపిస్తున్నాయా? మీ కలలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి

Lord ganesh in dreams | వినాయకుడు కలలో కనిపిస్తున్నాడా? ఏమవుతుందో తెలుసా !

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

Lord Shiva | శివునికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? పంచారామాల విశిష్టత ఏంటి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News