Tuesday, April 23, 2024
- Advertisment -
HomeLifestyleHoroscope & Vaasthuhoroscope today | రాశి ఫలాలు ( 08-01-2023 )

horoscope today | రాశి ఫలాలు ( 08-01-2023 )

horoscope today | మేషం

ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. పనుల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు సాధిస్తారు. ఇంటాబయటా ప్రోత్సాహం లభిస్తుంది. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సోదరులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. నూతన విద్యావకాశాలు లభిస్తాయి.

వృషభం

కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

మిథునం

కుటుంబసభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండండి. ఇతరుల విషయంలో జోక్యం తగదు. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం అందుతుంది. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు.

కర్కాటకం

పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తిని ఇస్తాయి. మిత్రులతో కలిసి ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఇంటర్వ్యూలో విజయంసాధిస్తారు. సంతానానికి నూతన విద్యావకాశాలు పొందుతారు. వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

సింహం

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ముఖ్య వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సోదరుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అందుతాయి. వివాహ, ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. స్వల్ప ధనలాభం పొందుతారు.

కన్య

దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగులకు పని ఒత్తిడులు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. సాంకేతిక విద్యపై ఆసక్తి చూపుతారు. ఆహ్వానాలు అందుతాయి.

తుల

బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు ముందుకు సాగవు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు.

వృశ్చికం

ఇంటాబయటా అనుకూల వాతావరణం నెలకొంటుంది. కొత్త మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. వస్తు లాభం ఉంది.

ధనుస్సు

దూరపు బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ముఖ్య పనుల్లో విజయం సాధిస్తారు. వాహన సౌఖ్యం కలదు. మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వస్తువులు కొనుగోలు చేస్తారు.

మకరం

పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది.

కుంభం

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనుల్లో ఏర్పడిన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి. మిత్రుల సహాయసహకారాలు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండటం అన్ని విధాలా మంచిది. ఇంటాబయటా ప్రోత్సాహం లభిస్తుంది. క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు.

మీనం

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆలయాలను దర్శించుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగ, వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. సంతాన సమస్యల నుంచి బయటపడతారు. ధనలాభ సూచన ఉంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Palmistry | మీ అర చేతిలోని గీతలు కలిస్తే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు

Tuesday | మంగళవారం ఈ పనులు అస్సలు చేయకండి.. పొరపాటున చేస్తే జీవితంలో అష్టకష్టాలు పడాల్సిందే !!

Temple | ఆలయంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? టెంకాయ కుళ్లిపోతే దోషమా?

Lord Shiva | శివునికి ఎన్ని ముఖాలు ఉన్నాయి? పంచారామాల విశిష్టత ఏంటి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News