Horoscope today | మేషం

ఇంటాబయటా ఎదురైన ఒత్తిడులు తొలగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. వృత్తి, వ్యాపారాల్లో కొంత ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరిగినా సకాలంలో పూర్తి చేస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధనలాభ సూచన ఉంది.
Horoscope today | వృషభం

నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రగతి సాధిస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలకు అనుకూలమైన సమయం. వాహనాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామి నుంచి వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు.
మిథునం

ఆర్థిక ఇబ్బందులు అంతంతమాత్రంగా ఉన్న అవసరానికి డబ్బు అందుతుంది. రుణాలు కొంతవరకు తీరుస్తారు. కోపతాపాలకు దూరంగా ఉండటం అన్ని విధాల మంచిది. కుటుంబంలో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు.
horoscope today | కర్కాటకం

శ్రమ ఫలిస్తుంది. నూతన ఉత్తేజంతో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. సోదరుల నుంచి ఆస్తి లాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.
horoscope today | సింహం

చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. మానసిక ప్రశాంతత పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి.
horoscope today | కన్య

కొత్త మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. కుటుంబసభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుస్తారు. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు.
horoscope today | తుల

ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
horoscope today | వృశ్చికం

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కాంట్రాక్టులు పొందుతారు. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. వివాహయత్నాలు ఫలిస్తాయి. వస్తు లాభాలు పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు.
horoscope today | ధనుస్సు

దూరపు బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. విందు, వినోదాలు, శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాల్లో హోదాలు పొందుతారు. స్వల్ప ధన లాభ సూచన ఉంది.
horoscope today | మకరం

కొత్త వ్యాపారాల్లో తొందరపాటు వద్దు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో ఏర్పడిన చికాకులు కొంతవరకు పరిష్కరించుకుంటారు. బాధ్యతలు మరింత పెరిగినా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొంతవరకు మెరుగుపడుతుంది. వస్తు లాభ సూచన ఉంది.
కుంభం

ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. ప్రయాణాల్లో తొందరపాటు వద్దు. మిత్రుల సహాయ సహకారాలతో ముందుకు సాగుతారు. వివాహ యత్నాలు సాగిస్తారు. ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. సాంకేతిక విద్యపై ఆసక్తి చూపుతారు.
horoscope today | మీనం

దూర ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆశ్చర్యపరుస్తుంది. నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నూతన వస్త్రాలు, వస్తువులు కొనుగోలు చేస్తారు.
Read More Articles:
Vasthu shastra | భోజనం చేసేటప్పుడు ఏ దిక్కున కూర్చుంటే మంచిది.. తినడానికి కూడా వాస్తు ఉంటుందా?
Vasthu shastra | అరటి చెట్టు ఇంట్లో పెంచితే అరిష్టమా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?