Home Lifestyle Health Immunity Boosters | కరోనా అలర్ట్.. ఇమ్యునిటీ పెరగాలంటే వీటిపై ఓ లుక్కేయాల్సిందే!

Immunity Boosters | కరోనా అలర్ట్.. ఇమ్యునిటీ పెరగాలంటే వీటిపై ఓ లుక్కేయాల్సిందే!

Immunity Boosters | కొద్దిరోజులుగా సైలెంట్‌గా ఉన్న కరోనా మరోసారి కోరలు చాస్తోంది. రోజు రోజుకు దేశవ్యాప్తంగా కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతున్నది. గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా కేసులు 40 శాతం పెరిగాయి. ఒక్కరోజులో 3016 పాజిటీవ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

అయితే కరోనా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ రోగనిరోధక శక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ట్యాబ్లెట్లతో కాకుండా సహజసిద్ధంగా రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయండి. ఇంతకీ ఏం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ? రోజూవారీ భోజనంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఓ లుక్కేయండి.

  • రోగనిరోధక శక్తి అనగానే గుర్తొచ్చేది సీ విటమిన్‌. ఒక్క కరోనాకే కాదు అన్ని రోగాలను ఎదుర్కోగల శక్తిని సీ విటమిన్‌ ఇస్తుంది. అందుకే సిట్రస్‌ జాతి పండ్లను తినడం అలవాటు చేసుకోవాలి. ఎలాగూ ఎండా కాలమే కాబట్టి ఆరంజ్‌, నిమ్మ, ఉసిరి వంటివి ఎక్కువ తీసుకుంటే శరీరానికి చల్లధనంతో పాటు ఇమ్యునిటీ కూడా పెరుగుతుందన్నమాట. సో.. ప్రతి రోజు ఓ గ్లాసు నిమ్మకాయ రసం, ఆరెంజ్‌ జ్యూస్‌ తాగేలా చూసుకోండి.
  • ఆకుకూరల్లో విటమిన్లు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి రోజూవారీగా తాజా ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. పాలకూర, బచ్చలి కూర, మెంతి వంటివి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకునేలా డైట్ ప్లాన్‌ చేసుకుంటే బెటర్.
  • ఉదయం లేవగానే గోరు వెచ్చని నీటిలో కాస్త తేనె, నిమ్మరసం కలుపుకొని తాగాలి. బెల్లం వేసుకుంటే అదనపు బలం వస్తుంది. శరీరంలో ఇమ్యునిటీ పెరగాలంటే ఐరన్‌ మస్ట్‌. బెల్లంలో కావాల్సినంత ఐరన్‌ ఉంటుంది. కాబట్టి రోజూ వారీగా బెల్లాన్ని ఆహారంలో భాగంగా చేసుకోండి.
  • పాలపదార్థాలైన పన్నీరు, వెన్న, నెయ్యిని ప్రతి రోజు తీసుకోవాలి. రోజు ఒక గ్లాసు పాలు తాగాలి. వీటిని ప్రతిరోజూ తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
  • ముఖ్యంగా మాంసాహారులైతే చికెన్‌, గుడ్లు తీసుకోవాలి. శాఖాహారులైతే డ్రైఫ్రూట్స్ ను రోజూవారీ డైట్‌లో తీసుకుంటే మంచిది. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.
  • ఎలాగూ ఇమ్యూనిటీ పెంచుకోవాలి కదా అని ట్యాబ్లెట్లను ఇష్టానుసారం వేసుకోవద్దు. కచ్చితంగా వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే ట్యాబ్లెట్ల జోలికి వెళ్లాలి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Viral News | మగాళ్లంతా ఇలాంటి భార్యే కావాలని కోరుకుంటారేమో.. అంతమంచి ఆఫర్ ఇస్తే ఎవరైనా కాదనుకుంటారా?

Sri Rama Navami | సీతారాముల కళ్యాణం చూసేందుకు గుడికి వెళ్లి.. బావిలో పడి 12 మంది భక్తులు మృతి

Tamilnadu | తమిళనాడులో పెరుగు కోసం లొల్లి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం

IAS Divya S Iyer | వాళ్లు నా బట్టలు విప్పేశారు.. లైంగిక వేధింపులను బయటపెట్టిన కలెక్టర్ దివ్య

Coronavirus | మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు

World Idli Day | మనం రెగ్యులర్‌గా తినే ఇడ్లీ ఇండియాది కాదా? మరి ఎక్కడి నుంచి వచ్చింది?

Exit mobile version