Home Lifestyle Health Health tips | రాత్రిపూట అన్నానికి బదులు చపాతీలు తినొచ్చా.. తింటే ఏమైనా ఉపయోగం ...

Health tips | రాత్రిపూట అన్నానికి బదులు చపాతీలు తినొచ్చా.. తింటే ఏమైనా ఉపయోగం ఉంటుందా ?

Health tips | కరోనా తర్వాత అందరి ఫోకస్‌ ఇప్పుడు ఆరోగ్యం మీద పడింది. ఆహారం విషయంలో జాగ్రత్తలు పెరిగిపోయాయి. చిన్న వయసులోనే గుండెపోట్లు రావడం, శ్వాససమస్యలు ఎక్కువ కావడంతో వ్యాయామానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. జీవనశైలిని మార్చకుంటున్నారు. బరువు తగ్గించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నరు.

Read more: Age and Fertility | తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఏ వయసులో పిల్లలను కనాలి ? గర్భిణులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

అందుకు తగ్గట్టే సరైన పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నారు. చాలామంది అన్నంకు బదులుగా కొర్రలు, సామలమీద పడ్డారు. మరికొందరేమో.. రాత్రిళ్లు అన్నం తినకుండా చపాతీల వైపే మొగ్గు చూపుతున్నారు. మరి రాత్రి పూట అన్నానికి బదులు చపాతీలు తింటే ప్రయోజనం ఉంటుందా.. అన్నమే బెటరా?

షూగర్ పేషెంట్లకు అత్యుత్తమం

సాధారణంగా షుగర్‌ పేషంట్లను రాత్రి పూట అన్నానికి బదులుగా చపాతీలు తినమని చెబుతారు. కారణం.. అన్నంలో కార్బొహైడ్రేట్‌లు ఎక్కువగా ఉండి త్వరగా అరిగిపోతుంది. దీంతో షుగర్‌ లెవల్స్‌ పెరిగిపోతాయి. అదే చపాతీలు తింటే వేగంగా అరగవు. ఫలితంగా షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయి.

Read more: Obesity | అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? రాత్రివేళలో భోజనానికి బదులు వీటిని తీసుకోండి..

బరువు తగ్గొచ్చు

బరువు తగ్గాలునకునే వారు కచ్చితంగా రాత్రి పూట చపాతీ తినడమే బెటర్‌. ఎందుకంటే.. చపాతీల్లో కొవ్వు పదార్థాలు ఉండవు. ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఎలాగూ చపాతీలే తింటున్నాం కదా అని ఇష్టం వచ్చినట్లు నూనె వేసి కాల్చుకుని తినొద్దు. ముఖ్యంగా రెండు, మూడు కంటే ఎక్కువగా తినకపోవడమే మంచిది.

ఎముకలకు ఎంతో మేలు

చపాతీల్లో ఎక్కువగా ఐరన్‌ ఉంటుంది. దీనివల్ల రక్తంలో హీమోగ్లోబిన్‌ శాతం కూడా పెరుగుతంది. గోధుమల్లో విటమిన్‌ బి, విటమిన్‌ ఈ, కాల్షియం, జింక్‌, సోడియం, పొటాషియం, మెగ్నిషియం వంటి మినర్సల్‌ కూడా ఎక్కువగా ఉంటాయి. అందువ‌ల్ల మ‌న శ‌రీరానికి అవసరమైన పోష‌ణ ల‌భిస్తుంది. ముఖ్యంగా దంతాలు, ఎముక‌లు దృఢంగా మారుతాయి.

గ్యాస్, మలబద్ధకానికి చెక్‌

గ్యాస్, అసిడిటీ, మలబద్ధకంతో బాధపడేవారికి రాత్రి పూట అన్నం కంటే చపాతీలే బెటర్. ఎందుకంటే రాత్రిపూట జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది. చపాతీలు కూడా నెమ్మదిగా అరుగుతాయి. కాబట్టి గ్యాస్‌, అసిడిటీ తగ్గుతాయి. నిద్ర కూడా త్వరగా పడుతుంది. అయితే చపాతీలు తిన్నాక నిద్రకు కనీసం గంటన్నర గ్యాప్‌ ఉండేలా చూసుకోవడం ఉత్తమం.

Follow Us : FacebookTwitter

Read More Articles | Wrinkles | న‌లభై ఏళ్లకే శరీరం ముడతలు పడుతోందా.. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.. !

Rising Dengue Cases | డెంగీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరిలో దీని ప్రభావం ఎక్కువ ?

చ‌లికాలంలో పెద‌వులు అందంగా కనిపించాలా?

Exit mobile version