Home Lifestyle Health Health TIps | రోజూ సరిగ్గా నిద్రపోకపోతే ఏమౌతుంది.. ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి?

Health TIps | రోజూ సరిగ్గా నిద్రపోకపోతే ఏమౌతుంది.. ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి?

Health TIps | ఉరుకుల పరుగుల జీవితం.. ఒత్తిళ్లు, ఆందోళనలతో కాలం గుడుపుతున్న నగర వాసులకు నిద్ర కరువు అవుతోంది. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలతో కాలక్షేపం చేస్తూ నిద్రకు దూరమవుతున్నారు. ప్రతిరోజూ కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిద్ర అవసరమైన వైద్యులు చెబుతున్నా.. చాలా మంది పట్టించుకోరు. కానీ ఆరోగ్యంగా జీవించాలంటే రోజూ తగినంత నిద్ర కచ్చితంగా ఉండాలి. లేదంటే పలు దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేమిటంటే…

  • నిద్ర సరిగ్గా పోకుంటే నేరుగా మెదడుపైనే ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. చురుగ్గా ఉండలేరు. ఏకాగ్రత కోల్పోతారు. ఏ విషయం గురించైనా సరిగ్గా ఆలోచించలేరు. ఆలోచించే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది.
  • రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే మరుసటి రోజు నిద్ర మత్తు ఉంటుంది. దీని వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగేందుకు ఆస్కారం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
  • నిద్ర సరిగ్గాపోకపోతే రోగ నిరోధక శక్తి తగ్గుతుందట. అలాగే హైబీపీ పెరుగుతుందట.
  • నిత్యం తగినన్ని గంటల పాటు నిద్రించకపోతే అధికంగా బరువు పెరగడంతోపాటు డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  • నిద్రలేమి వల్ల శృంగార సామర్థ్యం తగ్గిపోతుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎముకల్లో సాంద్రత తగ్గిపోయి అవి పెళుసుగా మారి పట్టుతప్పి కిందపడిపోతుంటారు. సో.. కంటినిండా నిద్రపోయి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Cholesterol | చెడు కొలెస్ట్రాల్‌కి మంచి కొలెస్ట్రాల్‌కి తేడా ఏంటి.. ? చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించుకోవాలి?

Health Tips | వామ్మో.. విటమిన్‌ Cతో ఇన్ని ప్రయోజనాలున్నాయా? ఏ వయసు వారికి ఎంత మోతాదులో విటమిన్‌ సీ అవసరం ?

Cancer | చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే కేన్సర్‌ను నిరోధించే ఛాన్స్‌.. ఏం చేయాలి !

Diabetes | ఈ జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహాన్ని జయించొచ్చు.. ఏంటవి?

Beauty tips | టీ, కాఫీలు తాగితే నల్లబడతారా? చర్మం నిగనిగలాడాలంటే ఏం చేయాలి?

Exit mobile version