Friday, March 29, 2024
- Advertisment -
HomeLifestyleHealthHealth tips | పరిగడుపున లెమన్‌ వాటర్‌ తాగితే ఏమౌతుంది.. అసలు చలికాలంలో లెమన్‌ వాటర్‌...

Health tips | పరిగడుపున లెమన్‌ వాటర్‌ తాగితే ఏమౌతుంది.. అసలు చలికాలంలో లెమన్‌ వాటర్‌ తాగొచ్చా?

Health tips | చలికాలం వచ్చిందంటే చాలు రోగ నిరోధక శక్తి తగ్గిపోయి చర్మ, శ్వాసకోశ సమస్యలు ఇబ్బంది పెడు తుంటాయి. కాస్త చలి పెరిగినా.. దగ్గు, జలుబుతో సతమతమవుతుంటాం. దీంతో మానసిక ఆందోళనలు పెరిగిపోతాయి. ఒత్తిడితో సతమతంఅవుతుంటాం. వీటన్నింటికీ చెక్‌ పెట్టాలంటే.. లెమన్‌ వాటర్‌ బెటర్‌ అంటున్నరు నిపుణులు.

ప్రతిరోజూ ఉదయం లేవగానే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకొని పరిగడుపున తాగితే అద్భుతమైన లాభాలు కలుగుతాయి. చలికాలంలో సహజంగానే ఉదయాన్నే లేవబుద్దికాడు. బద్ధకంగా ఉంటుంది. లెమన్‌ వాటర్‌ తాగితే శరీరం, మెదడు కూడా చాలా యాక్టివ్‌ అవుతుంది. ఉదయాన్నె లెమన్‌ వాటర్‌ తాగితే ఇంకా ఏం లాభాలున్నాయో మీరే చూడండి..

  • సాధారణంగా చలికాలంలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే లెమన్‌ వాటరే బెటరంట. ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసాన్ని కలుపుకుని తాగితే దగ్గు, జలుబు, ప్లూ జ్వరంలాంటి సమస్యలు ఇట్టే తగ్గిపోతాయట.
  • చలికాలంలో అందరినీ వేధించే మరో సమస్య చర్మం పొడిబారడం. ఉదయాన్నే నిమ్మరసం కలిపిన గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పొడిబారిపోకుండా ఉంటుంది. సీ విటమిన్‌తో రోగ నిరోధక శక్తి కూడా పెరిగి చర్మ సమస్యలు ఇబ్బంది పెట్టవు. చర్మం నాజూకుగా తయారై మిలమిల మెరిసిపోతుంది.
  • లెమన్‌ వాటర్‌తో రోగనిరోధక శక్తి పెరగడం వల్ల ఇన్ఫెక్షన్లు, జ్వరాలు రాకుండా ఉంటాయి. ఉదయాన్నే నిమ్మరసం కలిపిన వాటర్‌ తాగడం వల్ల బరువు తగ్గొచ్చని నిపుణులు చాలా అధ్యయనాల్లో వెల్లడించారు.
  • ముఖ్యంగా కిడ్నీల్లో రాళ్లు ఉన్నవాళ్లు, జీర్ణ సమస్యలతో ఇబ్బందులు పడేవారు నిమ్మరసం తాగడం వల్ల సమస్యల నుంచి బయటపడొచ్చట.
  • లెమన్‌ వాటర్‌ తాగడం వల్ల మెదడులోని కణాలు ఉత్తేజితమవుతాయి. దీంతో మానసిక పరిస్థితి మెరుగు పడి ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి.
  • తలతిరగడం, వికారం వంటి లక్షణాలను లెమన్‌ వాటర్‌ తగ్గిస్తుంది. ఇందులో బీ1, బీ2 అధికంగా ఉంటుంది. ఐరన్‌, పాస్పరస్‌, పొటాషియం వంటి మినరల్స్‌ ఎక్కువగా ఉంటాయి. అందుకే శరీరంలోని కణాలకు పోషకాలు త్వరగా అంది శక్తినిస్తాయి.

Follow Us : FacebookTwitter

Read more articles | Hallmark Gold | మీ బంగారు ఆభరణాలపై ఉన్న హాల్ మార్క్ అసలుదా.. నకిలీదా గుర్తించడం ఎలా?

vaasthu tips | వాస్తు ప్రకారం కిచెన్ ఏ దిక్కున ఉండాలి? ఎందుకు?

Change Name in Aadhar | పెళ్లి తర్వాత ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడం ఎలా.. ఏమేం డాక్యుమెంట్లు అవసరం?

Google Search | గూగుల్‌లో ఈ ప‌దాల‌ను అస్స‌లు సెర్చ్ చేయ‌కండి

Dengue Fever | డెంగీ జ్వరం వస్తే నొప్పి మాత్రలు ఎందుకు వేసుకోవద్దు ?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News